Begin typing your search above and press return to search.
OTT పై మనసు మళ్లిందా హరీషా.. ఎందుకని?
By: Tupaki Desk | 6 Oct 2020 12:20 PM ISTఅగ్ర హీరోలతో బ్లాక్ బస్టర్లు తీశాడు. అయినా అవకాశాల కోసం ఆపసోపాలు తప్పని సన్నివేశం ఉంది. అన్నిటినీ అధిగమించి కుర్రహీరోతో హిట్టు కొట్టి ఇప్పుడు మళ్లీ అగ్ర హీరోతో సినిమా చేస్తున్నాడు. కానీ ఇంతలోనే ఏదో అయ్యింది. అంతలోనే ఓటీటీ సిరీస్ అంటూ కొత్త ప్రయత్నం మొదలెట్టేశాడు. ఇంతకీ ఎవరా స్టార్ డైరెక్టర్ అంటారా? ఆయనే గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 28 వ చిత్రం తెరకెక్కిస్తున్నానని హరీష్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ కొన్ని నెలల క్రితం లాంఛనంగా ప్రకటించారు. రెగ్యులర్ షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభంలో ప్రారంభమవుతుంది. దీని కోసం హరీష్ స్క్రిప్ట్ కు తుది మెరుగులు దిద్దుతున్నాడు. ఈలోగానే పవన్ ఇతర షూటింగులు పూర్తి చేసుకుని హరీష్ కి అందుబాటులోకి వస్తారట.
అయితే ఈ గ్యాప్ లో ఏం చేయాలి? అని భావించారో ఏమో కానీ హరీష్ మరో కొత్త ప్రాజెక్టును పట్టాలెక్కించేస్తున్నారు. సీనియర్ పూరి జగన్నాథ్ తరహాలోనే ఆయన డిజిటల్ బాట పట్టేస్తున్నారు. హరీష్ ఓ ప్రముఖ OTT ప్లాట్ ఫామ్ కోసం ఒక చిత్రానికి స్క్రిప్ట్ రాసారట. త్వరలో ఈ మూవీని అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం నిర్మాత బన్నీ వాస్ తో హరీష్ చేతులు కలుపుతున్నారని ఫిలింనగర్ వర్గాలు ముచ్చటిస్తున్నాయి. అధికారిక ప్రకటన వచ్చే వరకూ వేచి చూడాల్సిందే.