Begin typing your search above and press return to search.

పవన్ కోసం చిరు ప్రాజెక్టు వద్దనుకున్న డైరెక్టర్!

By:  Tupaki Desk   |   3 March 2020 1:31 PM IST
పవన్ కోసం చిరు ప్రాజెక్టు వద్దనుకున్న డైరెక్టర్!
X
మోహన్ లాల్ నటించిన మలయాళం సూపర్ హిట్ 'లూసిఫర్' తెలుగు రీమేక్ రైట్స్ ను రామ్ చరణ్ తీసుకున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఈ సినిమాను నిర్మించాలనేది చరణ్ ప్లాన్. ఈ సినిమా రీమేక్ బాధ్యతలను హరీష్ శంకర్ కు అప్పగిస్తారని మొదట్లో వార్తలు వచ్చాయి కానీ ఇప్పుడు మాత్రం వీవీ వినాయక్ పేరు వినిపిస్తోంది. నిజానికి ఈ సినిమా రీమేక్ కోసం మొదట హరీష్ నే దర్శకుడిగా అనుకున్నారట. కానీ హరీష్ నో చెప్పడంతో వినాయక్ పేరును పరిశీలిస్తున్నారట.

మెగాస్టార్ సినిమాకు హరీష్ శంకర్ నో చెప్పడమా.. అంటూ షాక్ తినాల్సిన పనిలేదు. హరీష్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఆఫర్ వచ్చిన సంగతి తెలిసిందే. 'గబ్బర్ సింగ్' తర్వాత పవన్ తో అవకాశం రావడం తో హరీష్ ఈ ఆఫర్ ను వదులుకోవడం ఇష్టం లేదట. అందుకే మెగాస్టార్ ను వ్యక్తిగతంగా కలిసి పవన్ కళ్యాణ్ సినిమా ఆఫర్ వచ్చిందని.. ఈ సినిమా తర్వాత మీతో చేయడానికి రెడీగా ఉంటానని రిక్వెస్ట్ చేసుకున్నారట. అంతే కాదు చిరు కోసం ఒక మంచి స్క్రిప్ట్ కూడా తన దగ్గర ఉన్న విషయం వెల్లడించారట. విషం అర్థం చేసుకున్న చిరు సరే అన్నారట.

పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమా కు జోరుగా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందట. పవన్ ప్రస్తుతం 'వకీల్ సాబ్' లోనూ క్రిష్ దర్శకత్వంలో మరో సినిమాలోను నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ ప్రాజెక్ట్ సెట్స్ పైకి తీసుకెళ్తారని సమాచారం. 'గబ్బర్ సింగ్' తర్వాత పవన్ - హరీష్ శంకర్ కలిసి పని చేస్తున్న సినిమా కావడం తో ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.