Begin typing your search above and press return to search.

నాటకం.. కల అంటున్న మాస్ డైరెక్టర్

By:  Tupaki Desk   |   23 April 2020 12:20 PM IST
నాటకం.. కల అంటున్న మాస్ డైరెక్టర్
X
కమర్షియల్ సినిమాలు తెరకెక్కించడంలో హరీష్ శంకర్ ఓ స్పెషలిస్ట్. క్యాచీ డైలాగులతో ప్రేక్షకులను కట్టిపడేయడం కూడా హరీష్ ప్రత్యేకత. ఆయన కలం నుంచి జాలువారిన కొన్ని డైలాగులు రెగ్యులర్ లైఫ్ లో జనాలు వాడేంతగా పాపులర్ అవుతాయి. అందుకే హరీష్ ఎవరైనా స్టార్ హీరోతో సినిమా చేస్తున్నరంటే అంచనాలు భారీగా ఉంటాయి. హరీష్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ 28వ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ తో బిజీగా ఉన్నారు. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో అసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

హరీష్ తన స్కూల్ డేస్ లో నాటకాలలో పాలుపంచుకునేవారట. అప్పట్లో BHEL లో ఉండేవారని.. ఎన్నో నాటకాలలో నటించానని గుర్తు చేసుకున్నారు. మిస్రో.. నాయుడు గోపి.. తనికెళ్ళ భరణి.. కోట శ్రీనివాస రావు లాంటి వారి ప్రేరణతో నాటకాలపై ఆసక్తి కలిగిందని చెప్పారు. నాటక రంగంలో ప్రముఖులైన నాగ మోహన్ రావు.. అడబాల.. బీఎస్ శ్రీనివాస్ లాంటి వారు తనను ప్రోత్సహించారని తెలిపారు. నటనకు గానూ అప్పట్లో కొన్ని రాష్ట్రస్థాయి అవార్డులు కూడా అందుకున్నాని చెప్పి సర్ ప్రైజ్ చేశారు. తనకు ఎప్పటికైనా ఒక నాటకానికి దర్శకత్వం వహించాలని ఉందని.. అదే తన కలని చెప్పారు.

నిజానికి తెలుగు రాష్ట్రాల్లో నాటక రంగం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఈమధ్య ప్రపంచ ప్రఖ్యాత సురభి నాటక సంస్థకు సంబంధించిన వారు ఇబ్బందులలో ఉన్నారని వార్తలు వచ్చాయి. హరీష్ సురభి వారికి కొంత సాయం అందించారు. ఈ సందర్భంగానే నాటక రంగంతో తనకున్న అనుబంధం గురించి వెల్లడించారు.