Begin typing your search above and press return to search.

షాకింగ్ అవతారంలో డైరెక్టర్

By:  Tupaki Desk   |   27 Sept 2015 1:07 PM IST
షాకింగ్ అవతారంలో డైరెక్టర్
X
అదేదో సినిమాలో బ్రహ్మానందం డైలాగ్ చెప్పినట్లు.. అభివృద్ధికి ప్యాంటు షర్టు వేసినట్లుంటాడు హరీష్ శంకర్. టాలీవుడ్ లో చాలా మోడర్న్ గా - స్టైలిష్ గా ఉండే డైరెక్టర్ లలో హరీష్ శంకర్. అతడి నడత, మాట అన్నీ కూడా చాలా మోడర్న్ గా ఉంటాయి. అలాంటి వాడు పంచె కట్టుకుని.. ఒంటిపై పట్టు వస్త్రం వేసుకుని.. మెడలో రుద్రాక్షలతో.. గుండు చేయించుకుని.. బొట్టెట్టుకుని కనిపిస్తాడని ఎవ్వరూ ఊహించరు.

కానీ హరీష్ ఇలాంటి షాకింగ్ అవతారంలో కనిపించి అందరికీ షాకిచ్చాడు. హరీష్ శంకర్ సక్సెస్ టూర్ లో భాగంగా తిరుపతి వెళ్లిన సుబ్రమణ్యం ఫర్ సేల్ టీం అట్నుంచి అటే తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకుంది. హరీష్ గుండు చేయించుకుని ఓ పంతుల్లాగా బయటికి వచ్చాడు. సడెన్ గా దిల్ రాజు పక్కన అతణ్ని చూస్తే.. నిజంగా ఎవరో పంతుల్ని చూసినట్లే ఉంది. కాస్త తరచి చూస్తే తప్ప అది హరీష్ శంకర్ అన్న సంగతి అర్థం కాదు. ఆ అవతారంలోనే మీడియా ముందుకొచ్చి ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ ముచ్చట్లు చెప్పాడు హరీష్.