Begin typing your search above and press return to search.

మహేష్ కోసం కథ వండుతున్న మాస్ డైరెక్టర్!

By:  Tupaki Desk   |   17 April 2020 4:30 PM GMT
మహేష్ కోసం కథ వండుతున్న మాస్ డైరెక్టర్!
X
కమర్షియల్ సినిమాలు తెరకెక్కించడంలో కొందరు డైరెక్టర్లు స్పెషలిస్టులు.. కొందరేమో రీమేక్ సినిమాలు తెరకెక్కించడంలో స్పెషలిస్టులు. ఆ రెండు రకాల క్వాలిటీస్ పుష్కలంగా ఉండే దర్శకుడు హరీష్ శంకర్. హీరోలను కమర్షియల్ పంథాలో చూపిస్తూ తనదైన శైలిలో పంచ్ డైలాగులతో ప్రేక్షకులను మెప్పించడం హరీష్ స్టైల్. ఆయన ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించబోయే #PSPK28 చిత్రానికి స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్నారు.

'గబ్బర్ సింగ్' తర్వాత పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ఇదే కావడంతో అభిమానులు ఈ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న 'వకీల్ సాబ్'.. క్రిష్ డైరెక్షన్లో చేస్తున్న మరో చిత్రం పూర్తి కాగానే ఈ సినిమా పట్టాలెక్కు తుంది. ఇదిలా ఉంటే ఈమధ్య హరీష్ శంకర్ సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం ఒక స్క్రిప్ట్ తయారు చేస్తున్నారని వెల్లడించి అందర్నీ సర్ ప్రైజ్ చేశారు. మహేష్ బాబు ఇమేజ్ తగ్గట్టు ఇది ఓ కమర్షియల్ సబ్జెక్ట్ అని వెల్లడించారు. హరీష్ శంకర్ - మహేష్ బాబు కాంబినేషన్లో సినిమా అంటే దానికి ఖచ్చితంగా మంచి క్రేజ్ ఉంటుంది.

ఒకవేళ హరీష్- పవన్ కళ్యాణ్ సినిమా బాక్సాఫీసు దగ్గర విజయం సాధిస్తే హరీష్ శంకర్ - మహేష్ బాబు సినిమా పట్టాలు ఎక్కడం పెద్ద కష్టమేమీ కాదు. సూపర్ స్టార్ కోసం హరీష్ ఎలాంటి సబ్జెక్టు తయారు చేస్తున్నారనేది ఆసక్తికరమైన అంశమే. మరి ఈ సబ్జెక్టుతో మహేష్ ను మెప్పించగలరా లేదా అనేది వేచి చూడాలి.