Begin typing your search above and press return to search.
చివరి శ్వాస సెట్ లోనే -హరీశ్
By: Tupaki Desk | 27 Sept 2015 1:00 AM ISTదర్శకుడు హరీష్ శంకర్ గురించి నెగెటివ్ ప్రచారం ఎంత ఉందో పాజిటివ్ ప్రచారం కూడా అంతే ఉంది. అతడు ఎనర్జిటిక్ గయ్. హీరోల్ని అంతే ఎనర్జీతో చూపిస్తాడు. కెరీర్ లో ఎందుకు మిస్సయ్యాడో కానీ.. షాక్ - రామయ్యా వస్తావయ్యా వంటి ఫ్లాప్ లొచ్చాయి. ఆ రెండు షాక్ లు అతడిని వేదాంతిని చేశాయి. నేను వేదాంతిని కాను అంటూనే వేదాంతం మాట్లాడేస్తున్నాడు ఇటీవలి కాలంలో. రామయ్యా ఫ్లాప్ నిజంగానే అతడిని వేదాంతిని చేసింది. అసలు నా సినిమాల్లో ఎంటర్ టైన్ మెంటే లేదని ఎవరో విమర్శించారు. అందుకు హర్టయ్యాను అని చెప్పాడు హరీష్. ఆ కసి తీర్చుకునేందుకే సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమా తీశాడు హరీష్. ఈ సినిమాకి బి, సి సెంటర్లలో వసూళ్లు అదిరిపోయాయని రిపోర్ట్ వచ్చింది. ఇదే సందర్భంలో హరీష్ చెప్పిన ఓ మాట గుర్తు తెచ్చుకోవాలి.
డైరెక్టర్ సర్ ఇప్పుడే వచ్చారు. షాట్ ఎక్స్ ప్లెయిన్ చేశాడు. అప్పుడే చివరి శ్వాస తీసుకున్నారు!! నా చావు గురించి ఇలాంటి ఓ కామెంట్ వినాలనుకుంటున్నా... అంటూ షాకిచ్చాడు హరీష్ శంకర్. షూటింగ్ కోసం పడి చస్తాను! అని అన్నాడు. హరీష్ కమిట్ మెంట్ గురించి చెప్పడానికి ఇంతకంటే ఏం కావాలి. సినిమా అంటే ఎంత పిచ్చో ఈ మాటలే చెప్పేస్తున్నాయి. అందుకే 9 సంవత్సరాల క్రితం అసిస్టెంట్ డైరెక్టర్ గా - రైటర్ గా కెరీర్ మొదలెట్టి ఇంతలోగానే అంత పెద్ద డైరెక్టర్ అయ్యాడంటే అది ఓవర్ నైట్ దక్కినది కాదు. డెస్టినీ ఏంటో తెలియనప్పుడు ప్రతి క్షణాన్ని ఆస్వాధించాలి.. అనీ అతడు ఓ మాట వేశాడు. ఎంత వేదాంతం. ఇవన్నీ అర్థం చేసుకోవాలంటే అవతలి వాడు కూడా వేదాంతి అయ్యుండాలి. ప్చ్.. అది కుదురుతుందా?