Begin typing your search above and press return to search.

హరీష్ శంకర్ - మహేష్ ఉత్తుత్తి గాసిప్ కాదట!

By:  Tupaki Desk   |   18 April 2020 1:00 PM IST
హరీష్ శంకర్ - మహేష్ ఉత్తుత్తి గాసిప్ కాదట!
X
ఫిల్మ్ ఇండస్ట్రీ అన్న తర్వాత ఎన్నో గాసిప్పులు ప్రచారంలో ఉంటాయి. కొన్ని గాసిప్ లను కావాలనే క్రియేట్ చేస్తారు. కొందరు ఫిలిం మేకర్లు.. హీరోలే రూమర్లను.. లీకులను ప్రోత్సహిస్తారు అంటే అది చాలా మంది ప్రేక్షకులకు నమ్మబుద్ధి కాదు. అందుకే రోజు వచ్చే చాలా వార్తలలో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియకుండా ఉంటుంది. ఇదిలా ఉంటే మరో రకం వార్తలు ఉంటాయి ఫలానా హీరో కోసం కథ రెడీ చేస్తున్నానని ఓ దర్శకుడు.. ఫలానా దర్శకుడితో పని చేయాలని ఉందని ఒక స్టార్ హీరో ఎవరైనా కామెంట్ చేసినప్పుడు.. ఆటోమేటిక్ గా వారి కాంబినేషన్లో సినిమా ఫిక్స్ అయిపోయినట్టు గా ప్రచారం సాగుతుంది.

అయితే ఇవి పట్టాలు ఎక్కడం అంత సులువు కాదు. అనౌన్స్ మెంట్ అయిన సినిమాలు.. షూటింగ్ మొదలు పెట్టి కూడా ఆగిన సందర్భాలు ఇండస్ట్రీలో కోకొల్లలు. అందుకే మాట అనుకోగానే సినిమా రిలీజ్ అయినట్టు కాదు. రీసెంట్ గా హరీష్ శంకర్ - మహేష్ బాబు కాంబినేషన్ లో ఫ్యూచర్ లో ఒక సినిమా రానుందని వార్తలు వచ్చాయి. మహేష్ బాబు కోసం ఒక కమర్షియల్ స్క్రిప్ట్ తయారు చేస్తున్నానని హరీష్ వ్యాఖ్యానించడమే దీనికి కారణం. అయితే ఈ వార్తను ఎక్కువమంది సీరియస్ గా తీసుకోలేదు అన్నది వాస్తవం. ఎందుకంటే హరీష్ శంకర్ మొదట పవన్ కళ్యాణ్ సినిమాను పూర్తి చేయాల్సి ఉంది. అంతలోపు మహేష్ ఏ డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తారో తెలియదు. మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలకే రేపు ఏం జరుగుతుందో తెలియడం లేదు.. ఇక గ్రీన్ సిగ్నల్ ఇవ్వని సినిమాల గురించి ఏం మాట్లాడగలం? ఇలా అనుకుని చాలా మంది హరీష్ శంకర్ - మహేష్ కాంబినేషన్లో సినిమా ఇప్పట్లో సాధ్యం అయ్యే పని కాదు అని తేలికగా తీసి పారేశారు. కానీ వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా తెరకెక్కించేందుకు రంగం మాత్రం సిద్ధమవుతోందని.. అది వాస్తవమని సమాచారం అందుతోంది.

దీని వెనుక ఓ పెద్ద కథ ఉందని సమాచారం. మహేష్ బాబు ఒక ఓటిటి ప్లాట్ ఫామ్ ప్రారంభించే ఆలోచనలో ఉన్నారు. అందులోని కంటెంట్ ను దగ్గరుండి పర్యవేక్షించడానికి ఒక సీనియర్ డైరెక్టర్ అవసరం ఉంది. అయితే అతను జస్ట్ డైరెక్టరే కాకుండా రైటింగ్ కూడా తెలిసి ఉంటే ఓటీటీకి ఎక్కువ హెల్ప్ అవుతుందని మహేష్ భావిస్తున్నారట. అంతేకాకుండా తన సినిమాల ఎంపిక విషయంలో కూడా హరీష్ శంకర్ హెల్ప్ అవుతారని మహేష్ భావిస్తున్నారట. ఈ నేపథ్యంలోనే మహేష్.. నమ్రత ఇద్దరూ హరీష్ శంకర్ కు ఈ బాధ్యత అప్పజెప్పాలని ఆలోచిస్తున్నారట. ఇప్పటికే మహేష్ నుండి హరీష్ కు కాల్ వచ్చిందని ఆ ఓటీటీ కి సంబంధించిన డిస్కషన్ తో పాటుగా తనకు మంచి కమర్షియల్ స్టోరీ సిద్ధం చేయమని కోరినట్టుగా కూడా తెలుస్తోంది. అంతా బాగానే ఉంది కానీ మహేష్ మాటివ్వడం.. దర్శకులు కథ తయారు చేయడం.. అది సెట్స్ మీదకు వెళ్లకపోవడం అనేది చాలా కామన్ గా మారింది.. మరి హరీష్ శంకర్ అయినా ఆ సినిమాను రిలీజ్ వరకు తీసుకెళ్లగలడా అనేది వేచి చూడాలి.