Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ ఫ్యాన్స్ కు గ్యారెంటీ ఇస్తున్న హ‌రీష్ శంక‌ర్‌!

By:  Tupaki Desk   |   27 Aug 2022 6:42 AM GMT
ప‌వ‌న్ ఫ్యాన్స్ కు గ్యారెంటీ ఇస్తున్న హ‌రీష్ శంక‌ర్‌!
X
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ గ‌త కొంత కాలంగా ఫ్యాన్స్ ని టెన్ష‌న్ పెడుతున్నారు. ఆయ‌న సినిమాలు చేయాల‌ని ఫ్యాన్స్ కోరుకుంటుంటే ఆయ‌న మాత్రం సినిమాలు ఆపేస్తాన‌నే థోర‌ణిలో వ్య‌వ‌హ‌రిస్తూ క్రియాశీల రాజ‌కీయాల‌పై దృష్టిపెట్టారు. జ‌న‌సేన పార్టీని స్థాపించి ఏపీ రాజ‌కీయాల్లో కీల‌క పాత్ర పోషిస్తున్న విష‌యం తెలిసిందే. పార్టీ కార్య‌క్ర‌మాల కార‌ణంగా గ‌తంలో మూడున్న‌రేళ్ల పాటు సినిమాల‌కు దూరంగా వుంటూ వ‌చ్చారు.

ఫైన‌ల్ గా ఫ్యాన్స్ కోరిక ప్ర‌కారం మూడేళ్ల విరామం త‌రువాత 'వ‌కీల్ సాబ్‌' మూవీతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చారు. ఈ మూవీ థియేట‌ర్ల‌లో ఎలాంటి హంగామా సృష్టించిందో అంద‌రికి తెలిసిందే. ఈ మూవీ రిలీజ్ టైమ్ లో ఫ్యాన్స్ చేసిన ర‌చ్చ అంతా ఇంత కాదు. థియేట‌ర్ల గ్లాస్ డోర్స్ ప‌గిలి పోయేలా ప‌వ‌న్ కోసం అభిమానం క‌ట్ట‌లు తెంచుకుని థియేట‌ర్ల‌లో జాత‌ర వాతావ‌ర‌ణాన్ని త‌ల‌పించింది. ఈ మూవీ త‌రువాత వెంట‌నే మ‌రో రీమేక్ తో ప‌వ‌న్ రావ‌డంతో ఫ్యాన్స్ మ‌రింత‌గా ఖుషీ అయ్యారు.

మ‌ల‌యాళ సూప‌ర్ హిట్ ఫిల్మ్ 'అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్‌' ఆధారంగా తెర‌కెక్కిన మూవీ 'భీమ్లానాయ‌క్‌'. త్రివిక్ర‌మ్ డైలాగ్స్‌, స్క్రీన్ ప్లే అందించ‌గా సాగ‌ర్ కె. చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ మూవీ పాట‌లు, సినిమా ఓ రేంజ్ లో ఫ్యాన్స్ ని అల‌రించింది. బాక్సాఫీస్ వ‌ద్ద భారీ విజ‌యాన్ని సొతం చేసుకుంది. అయితే ఈ మూవీల‌కు ముందు ప‌వ‌న్ పాన్ ఇండియా మూవీని ప్రారంభించాడు. 'హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు' పేరుతో 17వ శ‌తాబ్దానికి చెందిన క‌థ‌తో ఈ మూవీని తెర‌కెక్కిస్తున్నారు.

క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఆగుతూ సాగుతూ ఆగుతూ అన్న‌థోర‌ణిలో సాగుతోంది. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ ఈ మూవీని ఎప్పుడు మ‌ళ్లీ మొద‌లు పెడ‌తాడు.. ఎప్పుడు పూర్తి చేస్తాడ‌నే విష‌యంలో క్లారిటీ క‌నిపించ‌డం లేదు. ప‌వ‌న్ నుంచి కూడా దీనిపై ఎలాంటి క్లారిటీ రావ‌డం లేదు. దీంతో ఫ్యాన్స్ ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. హ‌రీష్ శంక‌ర్ ప్రాజెక్ట్ కూడా గ‌త కొన్ని నెల‌లగా ఊగీస‌లాడుతోంది. ఈ ప్రాజెక్ట్ వుంటుందా? వుండ‌దా? అనే అనుమానాలు ఫ్యాన్స్ లో వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

హ‌రీష్ శంక‌ర్ డైరెక్ష‌న్ లో ప‌వ‌న్ 'భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్‌' చేయాల్సిన విష‌యం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ పై కూడా ఎలాంటి అప్ డేట్ వినిపించ‌క‌పోవ‌డంతో సోష‌ల్ మీడియా వేదిక‌గా ఫ్యాన్స్ హ‌రీష్ శంక‌ర్ కు మొర‌పెట్టుకుంటున్నారు. తాజాగా ఓ అభిమాని 'ఆ స్టెప్ లు, ఆ స్వాగ్‌.. ఆ స్టైల్ ఏమైపోయాయ్ క‌ల్యాణ్ అన్నా.. హ‌రీష్ శంక‌ర్ అన్నా మ‌ళ్లీ నీ వ‌ల్లే అవుతుంది ఇవ‌న్నీ.. నీ సినిమాతోనే లాస్ట్ అనిపిస్తుంది' అంట‌లూ ట్వీట్ చేశాడు.

దీనికి హ‌రీష్ శంక‌ర్ అదిరిపోయే రిప్లై ఇచ్చాడు. అన్నీ వుంటాయ్ .. ఏదీ మిస్స‌వ్వ‌దు.. న‌న్ను న‌మ్మండి. మీ ఎదురుచూపుల‌కు, నా ఎదురుచూసుల‌కు త‌గ్గ ప్ర‌తిఫ‌లం వ‌స్తుంది' అంటూ బ‌దులిచ్చాడు. ప్ర‌స్తుతం హ‌రీష్ చేసిన ట్వీట్ నెట్టింట వైర‌ల్ అవుతోంది. హ‌రీష్ శంక‌ర్ ఇచ్చిన భ‌రోసాతో ప‌వ‌న్ ఫ్యాన్స్ సంబ‌ర‌ప‌డిపోతున్నారు.