Begin typing your search above and press return to search.

మొగల్తూర్ నుండి వైష్ణవ్‌ తేజ్ వరకు.. మెగా ఫ్యామిలీపై హరీష్‌ శంకర్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

By:  Tupaki Desk   |   7 Feb 2021 3:41 AM GMT
మొగల్తూర్ నుండి వైష్ణవ్‌ తేజ్ వరకు.. మెగా ఫ్యామిలీపై హరీష్‌ శంకర్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌
X
వైష్ణవ్‌ తేజ్‌.. కృతి శెట్టి జంటగా బుచ్చి బాబు దర్శకత్వంలో రూపొందిన ఉప్పెన సినిమా ప్రీ రిలీజ్ వేడుక మెగాస్టార్‌ చిరంజీవి అతిథిగా వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ తో సంబంధం ఉన్న పలువురు దర్శకులు హాజరు అయ్యారు. త్వరలో పవన్‌ తో మైత్రి మూవీస్ బ్యానర్ లో సినిమా చేస్తున్న హరీష్‌ శంకర్‌ కూడా పాల్గొన్నాడు. ఆయన ఈ వేడుకలో మాట్లాడుతూ చిత్ర యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశాడు. బుచ్చి బాబు చాలా కాలంగా తెలుసు. అతడు మంచి దర్శకుడు అవుతాడని అనుకున్నాను. ఉప్పెన సినిమాతో మంచి సక్సెస్ ను అతడు దక్కించుకుంటాడనే నమ్మకంను వ్యక్తం చేశాడు.

ఇంకా హరీష్‌ శంకర్ మాట్లాడుతూ.. లోనికి వస్తున్న సమయంలో చిరంజీవి గారి కటౌట్ కనిపించింది. అప్పుడే నాకు అనిపించింది ఎక్కడ మొగల్తూరు.. ఎక్కడ చెన్నై ఫిల్మ్ ఇన్సిట్యూట్ ఎంతటి ప్రయాణం ఎంత గొప్ప ప్రస్థానం. ఇప్పుడు వైష్ణవ్ తేజ్ వరకు వచ్చింది. ఇది ఇంకా ఎంతో ముందుకు వెళ్లబోతుంది. భారత దేశంలో రాజ్‌ కపూర్‌ తర్వాత ఇంత పెద్ద ఫ్యామిలీ ని ఇండస్ట్రీకి అందించిన గొప్ప స్టార్‌ చిరంజీవి గారు. ఒక ఫ్యామిలీ ని ఇంతగా ఆధరించడం అంటే పూర్వజన్మ సుకృతం.

ఒక సారి పవన్‌ కళ్యాణ్‌ గారి వద్ద కథ చర్చలు జరుపుతున్న సమయంలో ఈ మూడు నెలలు వరుసగా మన ఫ్యామిలీ హీరోల సినిమాలే అన్నప్పుడు ఆయన ఇండస్ట్రీ మొత్తం మన ఫ్యామిలీనే అన్నారు. అలాంటి మాటలే చిరంజీవి గారు కూడా చాలా సార్లు అన్నారు. అందుకే కరోనా కష్టకాలంలో కార్మికులకు ఆయన అండగా నిలిచారు. ప్రతి ఒక్కరికి ఇండస్ట్రీలో మన అనుకుంటారు. ఉప్పెన సినిమా ఖచ్చితంగా సూపర్‌ హిట్‌ అవుతుందని నమ్మకం ఉంది. వైష్ణవ్‌ తేజ్‌ తో ఒక సినిమా చేస్తానంటూ కూడా చెప్పుకొచ్చాడు.