Begin typing your search above and press return to search.

'రామయ్యా వస్తావయ్యా' బాధ్యతంతా నాదే- హరీష్‌

By:  Tupaki Desk   |   11 April 2015 5:00 PM IST
రామయ్యా వస్తావయ్యా బాధ్యతంతా నాదే- హరీష్‌
X
హిట్టొస్తే ఆ క్రెడిట్‌ అందరిదీ అని చెప్పి.. ఫ్లాప్‌ వస్తే తనే బాధ్యత తీసుకునే డైరెక్టర్లు కొందరే ఉంటారు. అందులో హరీష్‌ శంకర్‌ ఒకడని చెప్పాలి. ఈ దర్శకుడి కెరీర్లో హిట్లు ఫ్లాపులు సమానం. షాక్‌ లాంటి డిజాస్టర్‌తో ఎంట్రీ ఇచ్చిన హరీష్‌.. ఆ తర్వాత మిరపకాయ్‌, గబ్బర్‌సింగ్‌ సినిమాలతో పీక్స్‌కు వెళ్లిపోయాడు. ఐతే మళ్లీ 'రామయ్యా వస్తావయ్యా' ఫ్లాప్‌తో కింద పడ్డాడు. ఐతే రామయ్యా వస్తావయ్యా ఫ్లాప్‌కు తనదే పూర్తి బాధ్యత అని చెప్పాడు హరీష్‌.

''రామయ్యా వస్తావయ్యా సినిమా ఫలితం నన్ను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఐతే ఈ సినిమా ఫ్లాపవడానికి పూర్తి బాధ్యత నాదే. నామీద నమ్మకంతో అన్ని విషయాల్ని నాపై వదిలేశారచు. అయినా విజయవంతమైన సినిమా తీయలేకపోయా'' అని చెప్పాడు హరీష్‌. ఐతే ఎన్టీఆర్‌కు కచ్చితంగా ఓ హిట్టివ్వాలని పట్టుదలతో మళ్లీ ఓ కథ సిద్ధం చేస్తున్నట్లు చెప్పాడు హరీష్‌.

మహేష్‌ బాబుతో హీరోయిజం ఉన్న ఓ వినోదాత్మక సినిమా తీయాలని ఉందని.. ఆ ఆలోచనతోనే ఓ కథ కూడా రాస్తున్నానని హరీష్‌ చెప్పాడు. సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌ పూర్తయ్యాక గీతా ఆర్ట్స్‌లో ఓ సినిమా, డీవీవీ దానయ్యతో ఓ సినిమా చేయాల్సి ఉందని.. పవన్‌ కళ్యాణ్‌, రవితేజల కోసం రెండు కథలు సిద్ధం చేసి ఉంచానని తెలిపాడు హరీష్‌. ఐతే సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌ తర్వాత తన సినిమా ఏదన్నది ఇప్పుడే చెప్పలేనన్నాడు.