Begin typing your search above and press return to search.
నాని హీరోయిన్ రెచ్చిపోయింది!
By: Tupaki Desk | 6 Dec 2015 10:27 AM GMTపిల్లజమిందార్ లో నానితో కలిసి నటించిన హరిప్రియ గుర్తుందా? అయినా మరిచిపోయే అందమా ఆమెది. అచ్చం మన తెలుగమ్మాయిలా ఉంటుంది. ఆమాటకొస్తే హరిప్రియ తెలుగమ్మాయే. మన పక్కనే ఉన్న బళ్లారి ఆమె సొంతూరు. తెలుగు బాగా మాట్లాడుతుంది. ఆ మక్కువతోనే తెలుగు ఇండస్ట్రీలో సెటిల్ అయిపోవాలనుకుంది. తకిట తకిటతో తెలుగు తెరపైకొచ్చిన ఆమె మంచి కథల్నే ఎంపిక చేసుకొంది. అభిరుచిగల కథానాయిక అన్న పేరు కూడా తెచ్చుకొంది. కానీ అదృష్టం మాత్రం కలిసిరాలేదు. పిల్లజమిందార్ తర్వాత అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్ అనే సినిమాలో నటించింది. అందులోనూ హరిప్రియ నటనకి మంచి పేరొచ్చింది. కానీ అవకాశాలు మాత్రం రాలేదు. ఇక లాభం లేదనుకొని ఆమె తన మాతృభాష అయిన కన్నడపై దృష్టిపెట్టింది.
అక్కడ మాత్రం వరుసగా అవకాశాలు అందుకొంటూ అదరగొడుతోంది. ఇటీవల ఆమె అక్కడ నీర్ డోస్ అనే చిత్రంలో నటించింది. అందులో హరిప్రియ కనిపిస్తున్న విధానం కిక్కించేలా ఉంది. ఎప్పుడూ లేని విధంగా మరీ కురచ దుస్తుల్లో కనిపిస్తోంది. ఇటీవలే ప్రచార చిత్రాలు విడుదలయ్యాయి. అందులో ఆమె డ్రెస్సులు ఎంత ఘాటెక్కించేలా ఉన్నాయో.. ఆమె భంగిమలు అంతకు మించి ఘాటుగా ఉన్నాయి. అవి చూసి హరిప్రియ ఇలా రెచ్చిపోయిందేంటి అని కన్నడ జనాలు మాట్లాడుకుంటున్నారు. అయితే పాత్ర రీత్యానే ఆమె అలా కనిపిస్తోందట. సినిమాలో హరిప్రియ కాల్ గాళ్ గా నటించినట్టు తెలిసింది. అయినా హరిప్రియ కాల్ గాళ్ గా కనిపించడం ఇదేం కొత్త కాదు. అమ్మాయి మాస్ అబ్బాయి క్లాస్ సినిమాలో కూడా హరిప్రయ వ్యభిచారిగా నటించింది. అయితే అందులో ఎక్కడా హద్దులు దాటినట్టు అనిపించలేదు. కానీ హద్దులు దాటి మరీ డ్రెస్సులేసినట్టు కనిపిస్తోంది. ఈ దెబ్బతో కన్నడలోనే కాదు... తెలుగు జనాలు కూడా మాట్లాడుకోవాలనే ఆమె అలా రెచ్చిపోయిందేమో మరి!!