Begin typing your search above and press return to search.

అప్పుడు నేను-బాలయ్య.. ఇప్పుడు వీరు

By:  Tupaki Desk   |   4 Sept 2017 9:15 AM IST
అప్పుడు నేను-బాలయ్య.. ఇప్పుడు వీరు
X
లవకుశులంటేనే అన్నదమ్ముల అనుబంధానికి - ఆత్మీయతకు పేరు. అదే పేరుతో నందమూరి సోదరులు కలిసి ఓ సినిమా చేశారు. ఎన్టీఆర్ హీరోగా అతడి అన్న నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాతగా బాబీ డైరెక్షన్ లో తెరకెక్కిన జై లవకుశ ఈ నెలలోనే థియేటర్లకు రానుంది. ఆడియో రిలీజ్ సందర్భంగా వారిద్దరి తండ్రి హరికృష్ణ ఈ లవకుశ సినిమా చూస్తుంటే ఆనాటి ఎన్టీఆర్ నటించిన లవకుశ గుర్తుకొస్తోందని... ఈ సినిమా కూడా ఆ స్థాయిలో ప్రజాభిమానం చూరగొనాలని కోరుకున్నారు.

అన్నదమ్ములకు సంబంధించిన కథతో తీసిన సినిమాను అన్నదమ్ములిద్దరూ కలిసి చేయడమే ప్రత్యేకమని హరికృష్ణ చెప్పుకొచ్చారు. తమ తరంలో ఇదే తరహా కాంబినేషన్ సెట్ అయిందని గుర్తు చేసుకున్నారు. రామకృష్ణ సినీ స్టూడియోస్ బ్యానర్ పై తాను నిర్మాతగా సినిమా తీస్తే తన తమ్ముడు బాలకృష్ణ ఆర్టిస్ట్ గా నటించాడన్నారు. మళ్లీ ఈతరంలో అన్న కళ్యాణ్ రామ్ నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్ పై సినిమా ప్రొడ్యూస్ చేస్తే తమ్ముడైన ఎన్టీఆర్ అందులో హీరోగా నటించాడు. ఓరకంగా చూస్తే ఇది అరుదైన కాంబినేషన్ అనే చెప్పాలి.

జై లవకుశ సినిమాకు మ్యూజిక్ అందించిన దేవి శ్రీ ప్రసాద్ తండ్రి సత్యమూర్తి తనకు మంచి అనుబంధం ఉందని హరికృష్ణ చెప్పారు. ఇదేవేదికపై దేవిశ్రీ ప్రసాద్ తనకు ఫ్యామిలీ మెంబర్ తో సమానమని ఎన్టీఆర్ చెప్పారు. ఇలా జై లవకుశలో రక్తసంబంధంతో పాటు స్నేహ సంబంధం కూడా రెండోతరంలో కలిసి పనిచేసిందనే మాట ఆడియన్స్ నుంచి వినిపించింది.