Begin typing your search above and press return to search.

'వకీల్ సాబ్' కి 'వీరమల్లు' ప్లస్ అవుతాడా? మైనస్ అవుతాడా?

By:  Tupaki Desk   |   12 March 2021 7:30 AM GMT
వకీల్ సాబ్ కి వీరమల్లు ప్లస్ అవుతాడా? మైనస్ అవుతాడా?
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసిన #PSPK27 అప్డేట్ నిన్న వచ్చేసింది. శివరాత్రి రోజు 'హరి హర వీరమల్లు' గా వచ్చిన పవన్ ని చూసి ఫ్యాన్స్ కి పునకాలు వచ్చాయని చెప్పవచ్చు. తమ అభిమాన హీరోని క్రిష్ జాగర్లమూడి ఎలా చూపిస్తాడో అని ఇన్నాళ్లు ఏదో ఒక మూలాన డౌట్ పడుతూ వచ్చిన ఫ్యాన్స్.. ఊహించని విధంగా పవన్ ని చూపించి ఉక్కిరిబిక్కిరి చేశాడు. రాబిన్ హుడ్ తరహా పాత్రలో పవన్ అదరగొట్టాడు. దీంతో ఇది కదా మాకు కావాల్సింది అంటూ పీకే అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కంబ్యాక్ మూవీ 'వకీల్ సాబ్' కి వీరమల్లు ప్లస్ అవుతాడా? మైనస్ అవుతాడా? అనే డిస్కషన్ స్టార్ట్ అయింది.

రాజకీయాల్లోకి వెళ్లి సినిమాలకు దూరమైన పవన్ మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తుండటంతో ఫ్యాన్స్ సంతోషించారు. ఈ నేపథ్యంలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'పింక్' రీమేక్ గా 'వకీల్ సాబ్' సినిమా తెరకెక్కుతోంది. దిల్ రాజు - బోనీ కపూర్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్ మళ్ళీ కంబ్యాక్ అవుతున్నందుకు ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అయినప్పటికీ 'వకీల్ సాబ్' వంటి సినిమాతో రావడం నిరాశ కలిగించిందని ఫ్యాన్స్ నుంచి కామెంట్స్ వచ్చాయి. అందుకే ఇప్పుడు 'వకీల్ సాబ్' ప్రమోషనల్ కంటెంట్ కి రాని హైప్ “హరిహార వీరమల్లు” కు వచ్చేసింది. పవన్ రీ ఎంట్రీ ఇలాంటి సినిమాతో కదా ఉండాల్సింది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఇప్పుడు 'వకీల్ సాబ్ మేకర్స్' పై మరింత ప్రెజర్ పెరిగే అవకాశం ఉంటుంది. గతేడాది రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఇప్పుడు ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రిలీజ్ కి ఇంకా నెల రోజులు కూడా లేదు.. అయినా 'వకీల్ సాబ్' పై బజ్ క్రియేట్ అవడం లేదని ఫిలిం సర్కిల్స్ లో ఇప్పటికే కామెంట్స్ వస్తున్నాయి. మ్యూజికల్ మార్చ్ అంటూ పాటలు రిలీజ్ చేస్తున్నా పవన్ నుంచి ఎక్సపెక్ట్ చేసే స్టఫ్ ఇంకా రాలేదని టాక్ ఉంది. దీనికి తోడు ఇప్పుడు 'వీరమల్లు' రాకతో 'వకీల్ సాబ్' కాస్త తగ్గినట్లే అనిపిస్తుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుంది కాబట్టి ప్రమోషన్స్ స్పీడ్ పెంచి హైప్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. 'వీరమల్లు'ని చూసిన ఫ్యాన్స్ 'వకీల్ సాబ్' ని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.