Begin typing your search above and press return to search.

పవన్ `హరి హర వీర మల్లు` బడ్జెట్ ఎంతంటే..?

By:  Tupaki Desk   |   12 March 2021 4:35 AM GMT
పవన్ `హరి హర వీర మల్లు` బడ్జెట్ ఎంతంటే..?
X
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ కళ్యాణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఓవైపు వ‌కీల్ సాబ్ చిత్రీక‌ర‌ణ పూర్తి చేసి క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో PSPK 27 చిత్రీక‌ర‌ణ‌లో బిజీ అయిపోయారు. హరి హర వీర మల్లు అనే టైటిల్ ని తాజాగా టీమ్ ప్ర‌క‌టించింది. మ‌‌హాశివ‌రాత్రి కానుక‌గా రిలీజైన ఫ‌స్ట్ టీజ‌ర్ ఆద్యంతం ఆస‌క్తిని రేకెత్తించింది. ప‌వ‌ర్ స్టార్ లుక్ అభిమానుల‌కు స్పెష‌ల్ ట్రీట్ గా నిలిచింది.

ఈ చిత్రం షూటింగ్ ఇప్ప‌టికే 40 శాతం పూర్తయింది. 60శాతం పూర్తి చేయాల్సి ఉంది. తాజా స‌మాచారం మేర‌కు ఈ సినిమా ప‌వ‌న్ క‌ల్యాణ్ కెరీర్ లోనే అత్య‌ధిక బ‌డ్జెట్ తో రూపొందుతోంది. దాదాపు 150కోట్ల బ‌డ్జెట్ ని హ‌రిహ‌ర వీర మ‌ల్లుకోసం వెచ్చిస్తున్నారు. ఆ మేర‌కు టీమ్ నుంచి స‌మాచారం వెల్ల‌డైంది. ఇక హిస్టారిక‌ల్ కాన్సెప్ట్ కి త‌గ్గ‌ట్టే వీఎఫ్ ఎక్స్ వ‌ర్క్ కూడా చాలా ఎక్కువ‌గా ఉంటుంద‌ని తెలిసింది. దీనికోసం హాలీవుడ్ సాంకేతిక నిపుణుల్ని క్రిష్ బ‌రిలో దించుతున్నారు. ఇందులో మ‌ల్ల యోధుల‌తో ప‌వ‌న్ భారీ ఫైట్.. ఓ షాడో ఫైట్ కూడా ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తుంద‌న్న లీకులు ఇంత‌కుముందు అందాయి.

త‌దుప‌రి కళాద‌ర్శ‌క‌ బృందం కీల‌క స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ కోసం చార్మినార్- రెడ్ ఫోర్ట్ - మచిలిపట్నం పోర్ట్ వంటి భారీ సెట్లు నిర్మించార‌ని తెలుస్తోంది. క‌థాంశానికి త‌గ్గ‌ట్టే నాటి వాతావ‌ర‌ణాన్ని సెట్ లో ఆవిష్క‌రించి వీఎఫ్‌ఎక్స్ తో మ‌రింత‌గా షైన‌ప్ చేయ‌నున్నార‌ని తెలిసింది. కేవ‌లం వీఎఫ్ ఎక్స్ కోసం ఆరు నెలల సమయం అవసరం అని చెబుతున్నారు. ఈ ప్ర‌తిష్ఠాత్మ‌క‌ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఏ.ఎం.ర‌త్నం నిర్మిస్తున్నారు.