Begin typing your search above and press return to search.

హరిహర వీరమల్లు.. మరో కొత్త టార్గెట్?

By:  Tupaki Desk   |   17 Jun 2022 1:30 PM GMT
హరిహర వీరమల్లు.. మరో కొత్త టార్గెట్?
X
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతోంది అనగానే అభిమానుల్లో అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్ని దాటేశాయి. ఒక విధంగా అంచనాలకు తగ్గట్టుగానే వారి పాన్ ఇండియా సినిమా చేయబోతున్నట్లు ప్రకటించడం ఎంతో ఆసక్తిని కలిగించింది. హరిహర వీరమల్లు సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఒక వర్గం పవన్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ సినిమాపై ఎంత పాజిటివ్ టాక్ ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కనీసం 50 శాతం షూటింగ్ కూడా పూర్తి కాలేదు. ఇంకా సగానికి పైగా షూటింగ్ చాలావరకు బ్యాలెన్స్ ఉండడంతో చిత్రయూనిట్ సభ్యులు ఈ సినిమాను ఎప్పుడు పూర్తి చేస్తారు అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఇతర కమిట్మెంట్స్ అలాగే రాజకీయాలతో బిజీగా ఉండటం వలన హరిహర వీరమల్లు మోక్షం కలగడానికి ఎక్కువ సమయం పట్టేలా ఉందనిపిస్తుంది.

ఇది వరకే ఈ సినిమాకు చాలా సార్లు బ్రేక్ లు పడ్డాయి. ఇక రీసెంట్ గా పవన్ కళ్యాణ్ రాజకీయాల కారణంగా అక్టోబర్ నుంచి చాలా బిజీగా ఉంటాడు. అప్పుడు ఎలాంటి షూటింగ్స్ పెట్టుకోవడానికి ఇష్టపడడం లేదని తెలుస్తోంది.

అయితే ఈ గ్యాప్ లోనే హరిహర వీరమల్లు సినిమాలు పూర్తి చేయాల్సి ఉంటుంది. అంటే మూడు నెలల్లో మిగతా 50% షూటింగ్ పూర్తి చేయడం అంటే అంత సాధారణమైన విషయం కాదు.

ఒక విధంగా దర్శకుడు క్రిష్ మూడు నెలల్లో కాపోతే రెండు నెలల్లో కూడా పూర్తి చేయగలడు కానీ మిగతా ఆర్టిస్టుల డేట్స్ కూడా అనుకున్న సమయానికి దొరకాలంటే చాలా కష్టమైన పని. ఇప్పటికే కొన్ని ప్రత్యేకమైన సెట్స్ కూడా నిర్మించడం జరిగింది.

ఆలస్యం చేస్తే అది కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మిగిలిన మూడు నెలల్లోనే ఈ సినిమాను పూర్తి చేయాల్సి ఉంటుంది. మరి ఈ కొత్త టార్గెట్ లో దర్శకుడు క్రిష్ సినిమాను పూర్తి చేస్తాడో లేదో చూడాలి.