Begin typing your search above and press return to search.

పిక్‌ టాక్‌ : ప్రియురాలితో క్రికెటర్‌ లవ్లీ ఫోజ్‌

By:  Tupaki Desk   |   20 July 2020 2:30 PM GMT
పిక్‌ టాక్‌ : ప్రియురాలితో క్రికెటర్‌ లవ్లీ ఫోజ్‌
X
కరోనా కారణంగా చాలా మంది ఉద్యోగాలు పోయి జీవితం దుర్భరంగా మారితే కొందరి జీవితాలు మాత్రం రంగుల మయం అయ్యాయి. ఎప్పుడు బిజీగా ఉండే సినీ స్టార్స్‌ మరియు జాతీయ స్థాయి క్రికెటర్స్‌ గత నాలుగు నెలలుగా పూర్తి విశ్రాంతి మూడ్‌ లో ఉన్నారు. ఈ సమయంలో వారు చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. వారి రెగ్యులర్‌ యాక్టివిటీస్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ వారి ఆనందాన్ని ఎంజాయ్‌ ను ఫాలోవర్స్‌ తో పంచుకుంటున్నారు.

టీం ఇండియా క్రికెటర్‌ హార్ధిక్‌ పాండ్య కరోనాకు ముందే తన ప్రేమ విషయాన్ని బహిర్ఘత పర్చాడు. నెట్టింట అతడు తన ప్రేయసి నటాషాను పరిచయం చేశాడు. ఇద్దరం ఒక్కటి కాబోతున్నాం అంటూ ప్రకటించాడు. ఈ లాక్‌ డౌన్‌ లోనే తాను తండ్రిని కాబోతున్నట్లుగా హార్ధిక్‌ ప్రకటించాడు. ప్రస్తుతం ఆమెతో కలిసి ప్రతి మూమెంట్‌ ను ఎంజాయ్‌ చేస్తున్నాడు.

సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌ గా హార్ధిక్‌ మరియు నటాషాలు పోస్ట్‌ లు పెడుతూనే ఉన్నారు. తాజాగా నటాషా ఈ ఫొటోను షేర్‌ చేసింది. వీరిద్దరి జంటను లవ్లీ అంటూ అభిమానులు కామెంట్‌ చేస్తున్నారు. మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌ అన్నట్లుగా ఉన్న ఈ కపుల్‌ ప్రస్తుతం కరోనా హాలీడేస్‌ ను ఫుల్‌ గా ఎంజాయ్‌ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఈ ఫొటోతో పాటు నటాషా నీవల్ల నేను సంపూర్ణం అయ్యానంటూ ఆనందం వ్యక్తం చేస్తూ కామెంట్‌ పెట్టింది.