Begin typing your search above and press return to search.

కొడుక్కు మహర్షి పేరు పెట్టిన పాండ్యా

By:  Tupaki Desk   |   18 Aug 2020 5:30 PM GMT
కొడుక్కు మహర్షి పేరు పెట్టిన పాండ్యా
X
టీం ఇండియా ఆల్‌ రౌండర్‌.. స్టార్‌ క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్యా ఇటీవలే తండ్రి అయిన విషయం తెల్సిందే. అతడి ప్రేయసి నటాషా స్టాంకోవిక్‌ జులై 30వ తారీకున మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెల్సిందే. కొడుకు పుట్టిన రోజే హార్దిక్‌ ఆ విషయాన్ని వెళ్లడి చేశాడు. నటాషాతో ఇప్పటికే ఎంగేజ్‌ మెంట్‌ అయిన పెళ్లి కాలేదు. త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతానికి కొడుకుతో పాండ్యా ఈ క్వారెంటైన్‌ టైంను ఎంజాయ్‌ చేస్తున్నట్లున్నాడు.

ఇటీవలే కొడుక్కు పాండ్యా అగస్త్య అనే పేరును పెట్టాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించాడు. తన కొడుకు పేరును పాండ్యా ప్రకటించిన వెంటనే సోషల్‌ మీడియాలో రెస్పాన్స్‌ అదిరి పోయింది. చాలా మంది నెటిజన్స్‌ అగస్త్య పేరును నెట్‌ లో కొట్టి సెర్చ్‌ చేశారు. అగస్త్య అంటే ఒక ప్రముఖ మహర్షి పేరు అంటూ గూగుల్‌ చూపిస్తుంది. అగస్త్య మహర్షికి హిందూయిజం ప్రచారం చేసిన మహర్షి అగస్త్య మహర్షి అంటూ వికీపీడియాలో సమాచారం నమోదు అయ్యి ఉంది. మొత్తానికి ఏ ఉద్దేశ్యంతో అగస్త్య అని పెట్టాడో కాని చాలా బాగుంది అంటూ నెటిజన్స్‌ అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నాడు.

ఈ అగస్త్య పెద్ద వాడు అయిన తర్వాత తండ్రిలా క్రికెట్‌ బాట పట్టేనా లేదంటే తల్లిలా కెమెరా ముందుకు వచ్చి స్టార్‌ అయ్యేనా అంటూ అభిమానులు ఇప్పటి నుండే ముచ్చటించుకుంటున్నారు. మరికొందరు అయితే తాను అనుకున్న ధర్మంను పాటించి ప్రచారం చేసిన అగస్త్య మహర్షి మాదిరిగా ఒక గొప్ప తత్వ వేత్త అవుతాడా అంటూ సరదాగా కామెంట్స్‌ చేస్తున్నారు.