Begin typing your search above and press return to search.

#హార్థిక్.. పుత్రోత్సాహ‌ము ఆ సుపుత్రుని క‌నుగొనంగ‌!

By:  Tupaki Desk   |   1 Jun 2021 10:40 AM IST
#హార్థిక్.. పుత్రోత్సాహ‌ము ఆ సుపుత్రుని క‌నుగొనంగ‌!
X
విదేశీ అంద‌గ‌త్తె నటాసా స్టాంకోవిక్ ని క్రికెటర్ హార్ధిక్ పాండ్యా ప్రేమించి వివాహ‌మాడిన సంగ‌తి తెలిసిందే. అందాల క‌థానాయిక‌ ఈవ్ లిన్ శ‌ర్మ‌తో బ్రేక‌ప్ అనంత‌రం హార్థిక్ స‌డెన్ గా యంగ్ హీరోయిన్ న‌టాషాని పెళ్లాడేయ‌డం హాట్ టాపిక్ అయ్యింది. ఇక ఈ జంట ఇటీవ‌ల పండంటి కుమారుడిని క‌న్నారు. పేరు అగస్త్య పాండ్య‌. 10 నెలలు నిండాయి. ప‌దో నెల‌ పుట్టినరోజు సంద‌ర్భంగా బీచ్ సెల‌బ్రేష‌న్స్ లో ఎంజాయ్ చేశారు ఈ జంట‌. ఈ సెల‌బ్రేష‌న్స్ కి సంబంధించి `హార్థిక్-న‌టాషా` వారి సుపుత్రుడితో ఉన్న‌ప్ప‌టి ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ అవుతున్నాయి.

కొన్ని ఆనంద క్షణాలను తన అభిమానులతో పంచుకునేందుకు హార్థిక్ - నటాసా స్టాంకోవిక్ జంట‌ సోమవారం ఇన్ స్టాగ్రామ్ కు వెళ్లారు. వారి 10 నెలల కుమారుడు అగస్త్యతో కలిసి బీచ్ ట్రిప్ చిత్రాలను పంచుకున్నారు.

ఇక హార్థిక్ షేర్ చేసిన ఫోటోల్లో పుత్రోత్సాహం స్ప‌ష్ఠంగా క‌నిపిస్తోంది. తండ్రిగా ఆనంద క్ష‌ణాల్ని హార్థిక్ పంచుకున్నారు. హార్థిక్ బ్లాక్ క్యాజువ‌ల్స్ లో క‌నిపించాడు. కొడుకును ఎంతో ప్రేమ‌గా చూస్తూ లాల‌న‌గా మురిసిపోతున్నాడు. ఇంట్లో ఉన్న‌ప్పుడు.. పూల్ లో స్విమ్ చేస్తున్న‌ప్పుడు.. విమాన ప్ర‌యాణాల్లో ఉన్న‌ప్పుడు త‌నయుడితో అత‌డి జాలీ సెల‌బ్రేష‌న్ ఈ ఫోటోల్లో క‌నిపిస్తోంది.