Begin typing your search above and press return to search.

ప్రేమ కహానీలు వినిపిస్తున్న క్రికెటర్

By:  Tupaki Desk   |   15 Feb 2017 2:08 PM GMT
ప్రేమ కహానీలు వినిపిస్తున్న క్రికెటర్
X
వేలంటైన్స్ డే సందర్భంగా.. నిన్న చాలానే ప్రేమకథలు మొదలై ఉంటాయి. లేదా ప్రపోజల్స్ జరిగి ఉంటాయి. సెలబ్రిటీ లవ్ స్టోరీస్ లో ఇలాంటి వాటిలో బయటపడ్డ ఓ కహానీ.. క్రికెటర్ హార్దిక్ పాండ్యా కథ. గత కొన్ని నెలలుగా ఈ క్రికెటర్.. కోల్కతా మోడల్ లిసా శర్మను ప్రేమిస్తున్నాడనే టాక్ ఉంది.

ఇద్దరూ కలిసి ఔటింగులు.. డేటింగులు చేస్తున్నారని.. తరచుగా కలిసి డిన్నర్లు లాగిస్తున్నారనే ప్రచారం కూడా ఉంది. అయితే.. వీటిపై ఇప్పటివరకూ వీరిలో ఎవరూ స్పందించలేదు. కానీ సడెన్ గా వేలంటైన్స్ డే రోజున.. హార్దిక్ పాండ్యాతో క్లోజ్ గా ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పెట్టేసింది లిసా శర్మ. సరిగ్గా ప్రేమికుల రోజునే ఈ పోస్ట్ చేయడంతో.. లవ్ స్టోరీని బైట పెట్టడంలో భాగమే ఇదంతా అనుకున్నారంతా. కానీ కొంత సమయానికే ఇది హాట్ టాపిక్ అవడంతో.. ఆ పోస్ట్ ను తీసేసింది లిసా శర్మ.

అయినా సరే.. అప్పటికే ఈ టాపిక్ బాగా స్ప్రెడ్ అయిపోయింది. దీంతో స్పందించి హార్దిక్ పాండ్యా.. 'ఇప్పుడు మీడియాలో వస్తున్న రూమర్లను ఖండించేందుకే ఇదంతా చెబుతున్నా. నేను ఇంకా క్రికెట్ నే సుదీర్ఘకాలం ప్రేమిస్తా. ఈ రూమర్లు.. ఫోటోలు మా కెరీర్ ని హార్డ్ వర్క్ ని డిస్టర్బ్ చేయవు. ఈ రూమర్ ఇక్కడితో ముగించాలని కోరుతున్నా' అంటూ చెప్పాడు హార్దిక్ పాండ్యా.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/