Begin typing your search above and press return to search.

అనన్య అందాల దాడిని తట్టుకోవడం కష్టమే!

By:  Tupaki Desk   |   6 July 2021 9:30 AM GMT
అనన్య అందాల దాడిని తట్టుకోవడం కష్టమే!
X
తెలుగు తెరపై బాలీవుడ్ భామలు .. మల్లూ బేబీల జోరు ఎక్కువ. అభినయం సంగతి అటుంచితే అందాల ఆరబోత విషయంలో వాళ్లకి పెద్దగా పట్టింపు ఉండదు. అందువలన తెరపై వాళ్లు అందమైన హంసల్లా స్వేచ్ఛగా విహరిస్తూ ఉంటారు. థియేటర్ కి వచ్చిన తరువాత హీరో ఎన్ని ఫైట్లు చేశాడు? ఎంతలా డాన్స్ చేశాడు? అనేది సాధారణ ప్రేక్షకులు చూస్తారు. కథాకథనాల విషయంలో సినిమా అంతా అయ్యాక ఒక నిర్ణయానికి వస్తారు. కానీ వాళ్లను థియేటర్ కి రప్పించడంలో మాత్రం హీరోయిన్ గ్లామర్ ప్రధానమైన పాత్రను పోషిస్తుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

అందుకే అంటారు మరి హీరోయిన్ చేతిలోని తొలి ఆయుధం అందమేనని. అలా అందాలు ఆరబోసే తీరుకు కొంత అభినయం .. ఆపై సక్సెస్ తోడైతే చాలు వాళ్ల కెరియర్ రాకెట్ లా దూసుకుపోతుంది. వీలైనన్ని విజయాలు వెనకేసుకుపోతుంది. అందాల ఆరబోత విషయంలో వెనకడుగు వేయడం వల్లనే తెలుగు హీరోయిన్స్ వెనకబడుతున్నారనే ఒక టాక్ చాలాకాలంగా వినిపిస్తోంది. అయినా స్వాతి రెడ్డి .. అంజలి అంతగా స్కిన్ షో చేయకుండానే కొన్ని హిట్లు పట్టుకున్నారు. తమకంటూ కొంత క్రేజ్ ను సంపాదించుకున్నారు.

కానీ ఈ మధ్య తెలుగు తెరకి పరిచయమైన 'అనన్య నాగళ్ల' మాత్రం తన రూటే సెపరేటు అన్నట్టుగా దూసుకువెళ్లడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. 'మల్లేశం' సినిమాలో కథానాయకుడి భార్య పాత్రలో తన సహజమైన నటనతో 'అనన్య నాగళ్ల' ఆకట్టుకుంది. ఆ తరువాత 'ప్లే బ్యాక్' వంటి సినిమా చేసిన ఆమె, 'వకీల్ సాబ్'లో మెరిసింది. ఈ సినిమా సాధించిన విజయం కారణంగా ఆమె పాత్రకి కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఆమె నలుగురి దృష్టిలో పడింది. యూత్ కూడా ఈ అమ్మాయిని గురించిన ఆలోచన చేసింది.

అనన్య నాగళ్ల కనుముక్కుతీరు చక్కగా ఉంటుంది. మోడ్రన్ డ్రెస్ లలోను .. చీరకట్టులోను ఆకర్షణీయంగా అనిపించే రూపం ఆమె సొంతం. 'మల్లేశం' సినిమాలో ఓ పల్లెటూరి పిల్లగా ఆమె పోషించిన పాత్ర వేరు. 'వకీల్ సాబ్' సినిమాతో ఆమెకి వచ్చిన గుర్తింపు వేరు. అప్పటి నుంచి ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉంటోంది. ఎప్పటికప్పుడు కొత్త ఫొటో షూట్లతో రచ్చ చేస్తోంది. ఒక పరిథి వరకూ అందాలు ఆరబోయడానికి తాను సిద్ధమనే సంకేతాలు పంపుతోంది. త్వరలోనే ఈ అమ్మాయి కుర్ర హీరోల జోడీగా బిజీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. అనన్య బరిలోకి దిగితే ఆ అందాల దాడిని తట్టుకోవడం కుర్రాళ్లకు కష్టమే! ఆమె అవకాశాల ధాటికి తట్టుకోవడం కొత్త హీరోయిన్లకూ కష్టమే!!