Begin typing your search above and press return to search.
బన్నీ డేట్లు .. 'పుష్ప' టిక్కెట్లు దొరకడం కష్టమే!
By: Tupaki Desk | 17 Dec 2021 9:00 AM ISTకరోనా కారణంగా కొంతకాలం పాటు థియేటర్లు మూతబడిన సంగతి తెలిసిందే. ఆ తరువాత థియేటర్లు ఓపెన్ అయినా, ధైర్యం చేసి థియేటర్ల గేటు దాటి లోపలికి అడుగుపెట్టిన సినిమాలు కూడా తక్కువే. థియేటర్లో పాస్ మార్కులు వేయించుకుని బయటికి వెళ్లిన సినిమాలు బహు తక్కువ. చాలా థియేటర్లు ప్రేక్షకుల కోసం ఎదురుచూస్తూ తెర అంతా కళ్లుచేసుకుని చూస్తున్నాయి.
మల్టీ ప్లెక్స్ ల విషయానికి వస్తే షో ఉంటుందో .. కేన్సిల్ చేస్తారో చివరి నిమిషం వరకూ తెలియని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లోనే ఆ మధ్య వచ్చిన 'క్రాక్' .. ఇటీవల వచ్చిన 'అఖండ' థియేటర్లకు ధైర్యం చెప్పాయి.
థియేటర్ల దగ్గర ఇక పెద్ద ఎత్తున జాతర మొదలుకావాలంటే అయితే 'ఆచార్య' రావాలి .. లేదంటే 'ఆర్ ఆర్ ఆర్' రంగంలోకి దిగాలని చాలామంది అనుకున్నారు. 'ఈ మధ్య లో నేను ఉన్నాను గదా బ్రదర్' అంటూ అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాతో వచ్చేశాడు.
బన్నీ లుక్ నుంచి మొదలు .. నిన్న జరిగిన ప్రెస్ మీట్ వరకూ చూసుకుంటే, సుకుమార్ ఎంత గొప్పగా ఈ సినిమాపై అంచనాలు పెంచుతూ వెళ్లాడో అర్థమవుతుంది. ఆయనలోని లెక్కల మాస్టారు ఇక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తాడు. సినిమాలో కథ ఉంటే సరిపోదు .. కథ ఉందనే విషయాన్ని ముందుగానే ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్లడమే గొప్ప విషయం.
అసలు 'పుష్ప' కథేమిటి? అనే విషయాన్ని సుకుమార్ ఇంతవరకూ బయటికి రాకుండా చూడటం విశేషం. మాటలు .. పాటలు .. ఫైట్లు .. ఇలా అన్ని అంశాల విషయంలో అంచనాలు పెంచుతూనే అసలు కథను మాత్రం థియేటర్లకు వచ్చేవారి కోసమే దాచిపెట్టాడు. దాచిన విషయాల పట్ల ఆసక్తి .. ఆత్రుత ఎక్కువగా ఉండటం సహజం.
అందువల్లనే ఈ సినిమా తొలి ఆట చూడాలని అంతా పోటీపడుతున్నారు. టిక్కెట్లు దొరకనివారు ఎవరి ద్వారా అవి దొరుకుతాయా అనే సెర్చింగ్ లో ఉన్నారు. అలా టిక్కెట్ల కోసం తనకి కాల్స్ చేసేవారికి సమాధానం చెప్పడంతోనే నిన్నంతా గడిచిపోయిందని రాహుల్ రవీంద్రన్ చెబుతున్నాడు.
హైదరాబాద్ లో 'పుష్ప' టిక్కెట్ దొరికించుకోవడం కష్టమైపోతుందనీ, తనకి కాల్స్ చేసినవారిని తానే టిక్కెట్స్ అడిగానని ఆయన చెప్పాడు. ఇలా ఎవరికి వారు తమకి తెలిసినవారి దగ్గర టిక్కెట్స్ దొరుకుతాయేమోనని తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. టిక్కెట్ల వేటలో 'తగ్గేదే లే' అన్నట్టుగానే బలమైన పట్టుదలతో ముందుకు వెళుతున్నారు.
ఈ జోరు చూస్తుంటే 'పుష్ప' ధాటిని థియేటర్లు తట్టుకోవడం కష్టమేననిపిస్తోంది. బన్నీకి ఉన్న క్రేజ్ కారణంగా ఆయన డేట్లు దొరకడం కష్టమనే మాట వింటూ వచ్చాము. కానీ ఆయన సినిమాకి టిక్కెట్లు దొరకడం కూడా కష్టమేననే విషయాన్ని 'పుష్ప' నిరూపించింది .. అందునా ఈ పరిస్థితుల్లో!