Begin typing your search above and press return to search.

ఆమె నా హీరోయిన్ అనేసిన హ‌ర్భ‌జ‌న్‌.. నొచ్చుకున్న భార్య‌..! ఏమ‌న్న‌దో తెలుసా?

By:  Tupaki Desk   |   17 Feb 2021 7:00 PM IST
ఆమె నా హీరోయిన్ అనేసిన హ‌ర్భ‌జ‌న్‌.. నొచ్చుకున్న భార్య‌..! ఏమ‌న్న‌దో తెలుసా?
X
ఇప్పుడు దేశంలోని సినీ ఇండస్ట్రీలో బయోపిక్ ల హవా నడుస్తోంది. సినీ, రాజకీయ ప్రముఖులతోపాటు క్రికెటర్ల బయోపిక్ లు కూడా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తాజాగా.. తన బయోపిక్ పై స్పందించాడు మాజీ టీమిండియా ఆటగాడు హర్భజన్ సింగ్.

ఇటీవలే అధికారికంగా క్రికెట్ కు గుడ్ బై చెప్పిన భజ్జీ.. సినీరంగంలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. ఇన్నాళ్లూ క్రికెట్ మైదానంలో ప్రేక్షకులను అలరించిన హర్భజన్.. ఇక పై వెండి తెరపై నుంచి ఫ్యాన్స్ ను ఆకట్టుకోబోతున్నాడు. తమిళ్ సినీ ఇండస్ట్రీ ద్వారా నటుడిగా పరిచయం కాబోతున్నాడు హర్భజన్. యాక్షన్ కింగ్ అర్జున్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న భజ్జీ.. ‘ఫ్రెండ్‌షిప్’ అనే చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కానుంది.

కాగా.. తన బయోపిక్ విషయమై మాట్లాడిన హర్భజన్.. తనపై బయోపిక్ తీస్తే, తానే హీరోగా ఉంటానన్నాడు. తన జీవితం లోతెంతో తనకే తెలుసు కాబట్టి, ఆ పాత్రకు తాను తప్ప, మరొకరు న్యాయం చేయలేరు అన్నాడు భజ్జీ. అందువల్ల నా నిజ జీవిత పాత్రకు తెరపై కూడా తానే ప్రాణం పోస్తే బాగుంటుందని అన్నాడు హర్భజన్.

అయితే.. ఒకవేళ తాను కాకుండా తన పాత్రలో వేరొకరు నటించాల్సి వస్తే.. అది రణ్‌వీర్ సింగ్ అయితే బాగుంటుందని చెప్పాడు. రణ్ వీర్ తన పాత్రకు న్యాయం చేయగలడు అని చెప్పాడు భజ్జీ. ఇక, తన భార్య గీతా బస్రా పాత్రకు బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ అయితే కర్టెక్ట్‌గా సూట్ అవుతుందని చెప్పాడు. అయితే.. ఈ ప్రతిపాదనల‌ను హర్బజన్ వైఫ్ కొట్టిపారేయడం విశేషం!

త‌న పాత్ర‌లో కియారా అద్వానీని ఒప్పుకోని గీతా బ‌స్రా.. హ‌ర్బ‌జ‌న్ పాత్ర‌లో ర‌ణ్ వీర్ ను కూడా యాక్సెప్ట్ చేయ‌లేదు. వీరికి బ‌దులుగా ఆమె మ‌రో ఇద్ద‌రిని సూచించారు. హర్భజన్ పాత్రలో వికీ కౌశల్, తన పాత్రకు ప్రియాంక చోప్రా జోనస్ అయితే కరెక్ట్‌గా సరిపోతారని చెప్పుకొచ్చింది బ‌స్రా. వారిద్దరు మాత్రమే మా పాత్రలకు న్యాయం చేస్తారు అని ఆమె చెప్ప‌డం గ‌మ‌నార్హం.

ఈ విధంగా.. భార్యాభ‌ర్త‌లు ప‌రస్ప‌ర విరుద్ధ‌మైన అభిప్రాయాలు వెల్ల‌డించ‌డం హాట్ టాపిక్‌గా మారింది. కాగా.. హర్బజన్ సింగ్, గీత బస్రా లైఫ్ చాలా కాలం ప్రేమించుకొన్న తర్వాత ఒక్క‌ట‌య్యారు. 2015, అక్టోబర్ 29వ తేదీన వీరు వివాహం చేసుకొన్నారు. వీరికి హినయా హీర్ ప్లాహా అనే కూతురు కూడా ఉంది.