Begin typing your search above and press return to search.
ప్రముఖ గాయనికి వేధింపులు.. డైరెక్టర్ అరెస్ట్
By: Tupaki Desk | 17 July 2021 9:00 PM ISTఇంటర్వ్యూకు పిలిచాడు. ఆమె ఫొటోలను తీసుకున్నాడు. ఆ ఫొటోలతో తన యూబ్యూబ్ చానెల్ కు, వెబ్ సిరీస్ వీడియోలు, అల్బమ్స్ కు వాడేశాడు. అలా అనుమతి లేకుండా ఓ సింగర్ ఫొటోలను వాడిన డైరెక్టర్.. ఆమె ఎంత చెప్పినా వినలేదు. తీసేయలేదు. దీంతో విసిగి వేసారిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఆ డైరెక్టర్ అరెస్ట్ కావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
హైదరాబాద్ నగరానికి చెందిన మెడికాయల నవీన్ కుమార్ (34) షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ ప్లే బ్యాక్ సింగర్ ను గతంలో నవీన్ కుమార్ ఇంటర్య్యూకు పిలిచి ఆమె ఫొటోలు, వీడియోలు ఇంటర్వ్యూ తీసుకున్నాడు. ఇంటర్వ్యూ కోసం.. ప్రోమో కోసం అని ఆ సింగర్ ఊరుకుంది.
అయితే ఆమె ఫొటోను లోగోగా ఉంచి ఆమె పేరు మీదనే ఒక యూట్యూబ్ చానెల్ ను నవీన్ కుమార్ ప్రారంభించాడు. తర్వాత బాధితురాలి పేరు మీద ఒక చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. తన వెబ్ సిరీస్ వీడియోలు, ఆల్బమ్ సాంగ్స్, షార్ట్ ఫిలిం వీడియోలు అప్ లోడ్ చేశాడు.
ఈ వీడియోలు చూసిన ప్రముఖ సింగర్ షాక్ అయ్యింది. తన అనుమతి లేకుండా ఇలా తన ఫొటోలు, వీడియోలు వాడడంపై అభ్యంతరం తెలిపింది. వెంటనే తీసేయాలని కోరింది. అయినా నవీన్ కుమార్ ఆమె మాటలు పట్టించుకోలేదు.
సింగర్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వీడియోలు అందులో అప్ లోడ్ చేస్తూ ఆమెను మానసికంగా వేధించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు రాచకొండ సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసుకొని శుక్రవారం నవీన్ కుమార్ ను అరెస్ట్ చేశారు. అనంతరం రిమాండ్ కు తరలించారు.ఇక ప్రముఖ సింగర్ ను వేధించి ఆ షార్ట్ ఫిలిం డైరెక్టర్ కటకటాల పాలయ్యాడు.