Begin typing your search above and press return to search.
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.. కూతురితో విరుష్క సందడి
By: Tupaki Desk | 8 March 2021 6:07 PM ISTమహిళా దినోత్సవ వేళ సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది. సామాన్యులతోపాటు సెలబ్రిటీల వరకూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ గ్రీటింగ్స్ చెబుతున్నారు. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడాలేకుండా సినీ ప్రముఖులు కూడా పోస్టులు పెట్టి మహిళల గొప్పదనం గురించి చాటి చెబుతున్నారు.
భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆయన సతీమణి అనుష్క శర్మ కూడా ఈ అద్భుతమైన సందర్భంలో ఆనందంలో మునిగిపోయారు. తమ కూతురు వామిక ను చూస్తూ సంతోషం వ్యక్తంచేస్తున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనికో అద్భుతమైన క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు.
పిల్లలకు జన్మనివ్వడం అనేది మనిషి జీవితంలో అద్భుతమైన విషయమని, అందమైన అనుభవమని చెప్పాడు కోహ్లీ. దేవుడు మహిళలకు మాత్రమే ప్రాణంపోసే శక్తిని ఎందుకు ఇచ్చాడంటే.. వారు పురుషులకన్నా బలవంతులు కాబట్టే అన్నాడు కోహ్లీ. తన జీవితంలో ఉన్న మహిళలతోపాటు అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెబుతున్నానని ప్రకటించాడు. ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.