Begin typing your search above and press return to search.

షాకింగ్ః ‘హ్యాపీ డేస్’ టైస‌న్.. నిజంగానే అయ్యాడుగా!

By:  Tupaki Desk   |   16 May 2021 7:30 AM GMT
షాకింగ్ః  ‘హ్యాపీ డేస్’ టైస‌న్.. నిజంగానే అయ్యాడుగా!
X
శేఖ‌ర్ క‌మ్ముల సంచ‌ల‌నం ‘హ్యాపీ డేస్‌’ను ఎవ్వ‌రూ అంత ఈజీగా మ‌రిచిపోలేరు. అందులోని పాత్ర‌లు కూడా అంతే. అయితే.. ఈ సినిమాలో బాగా అట్రాక్ట్ చేసిన క్యారెక్ట‌ర్ల‌లో టైస‌న్ రోల్ ఒక‌టి. ఈ పాత్ర‌లో న‌టించిన రాహుల్ ఎంత బ‌క్క‌గా ఉంటాడో తెలిసిందే. అందుకే.. అత‌న్ని ఫ్రెండ్స్ వెక్కిరిస్తూ టైస‌న్ అనేవారు. ఈ సినిమాలోని ఆ పాత్ర‌తోపాటు రాహుల్ కూడా ప్రేక్ష‌కుల మ‌దిలో నిలిచిపోయాడు.

అయితే.. ఈ చిత్రంలో న‌టించిన వ‌రుణ్ సందేశ్‌, నిఖిల్ ఆ త‌ర్వాత మంచి అవ‌కాశాల‌తో హీరోలుగా పాపుల‌ర్ అయ్యారు. కానీ.. రాహుల్ మాత్రం స‌క్సెస్ కాలేక‌పోయాడు. 2017లో ‘వెంక‌టాపురం’ అనే సినిమాతో వ‌చ్చాడు. కానీ.. ఆ చిత్రంతో అంత‌గా ఆక‌ట్టుకోలేక‌పోయాడు. మ‌ళ్లీ ఇన్నాళ్ల త‌ర్వాత ఇప్పుడు మ‌రో మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు వస్తున్నాడు.

రాహుల్ కొత్త చిత్రం ‘‘100 క్రోర్స్’’. ఈ మ‌ధ్య‌నే ప్రారంభోత్స‌వం కూడా పూర్త‌యిన ఈ సినిమా.. క‌రోనా గోల త‌గ్గిన త‌ర్వాత సెట్స్ పైకి వెళ్ల‌నుంది. అయితే.. ఈ చిత్రం కోసం రాహుల్ మారిపోయిన తీరు చూస్తే షాక్ అవ‌డం గ్యారంటీ. అస‌లు.. హ్యాపీడేస్ టైసన్ ను.. ‘‘100 క్రోర్స్’’ రాహుల్ ను పోల్చుకోవ‌డానికే చాలా స‌మ‌యం ప‌డుతుంది. అంత‌లా మేకోవ‌ర్ అయ్యాడు రాహుల్.

ప‌ర్ఫెక్ట్ గా బాడీని బిల్డ‌ప్ చేసిన రాహుల్‌.. కోర మీస‌క‌ట్టుతో.. చేతిలో డంబెల్స్ తో కేక పెట్టిస్తున్నాడంటే అతిశ‌యోక్తి కాదు. ఈ లుక్ చూసిన వారంతా అన్ బిలీవ‌బుల్ అని కామెంట్ చేస్తున్నారు. ‘‘100 క్రోర్స్’’ చిత్రాన్ని విరాట్ చ‌క్ర‌వ‌ర్తి అనే డెబ్యూ డైరెక్ట‌ర్ తెర‌కెక్కిస్తున్నాడు. ఎస్ ఎస్ స్టూడియోస్ బ్యాన‌ర్ పై నాగం తిరుప‌తి రెడ్డి నిర్మిస్తున్నారు. సాక్షి చౌద‌రి హీరోయిన్‌.