Begin typing your search above and press return to search.
హ్యాపీ బర్త్ డే రౌడీ బేబీ
By: Tupaki Desk | 9 May 2020 6:25 AM ISTమలయాళ ప్రేమమ్ చిత్రంలో మలార్ పాత్రతో అందరి దృష్టిని ఆకర్షించిన ముద్దుగుమ్మ సాయి పల్లవి. అప్పటి వరకు డాన్సర్ గా.. కొరియోగ్రఫర్ గా చేసిన సాయి పల్లవి ప్రేమమ్ చిత్రంతో హీరోయిన్ గా టర్న్ అయ్యింది. తెలుగులో ఈ అమ్మడు ఫిదా చిత్రంతో పరిచయం అయ్యింది. మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఆ వెంటనే బ్యాక్ టు బ్యాక్ ఈమెకు ఆఫర్లు వచ్చాయి. కాని వచ్చిన ప్రతి ఆఫర్ ను ఒప్పుకోకుండా కథ.. పాత్ర నచ్చితేనే సినిమా చేస్తూ వచ్చింది. ఆ క్రమంలోనే శ్రీనివాస కళ్యాణం చిత్రంకు అడ్వాన్స్ తీసుకున్నా పాత్ర నచ్చలేదంటూ తప్పుకుంది.
తెలుగు మరియు తమిళంలో కంటిన్యూగా సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు సౌత్ స్టార్ హీరోయిన్ గా దూసుకు పోతుంది. తమిళంలో ఈ అమ్మడు ధనుష్ తో కలిసి చేసిన చిత్రంలోని రౌడీ బేబీ పాటతో ఆల్ ఇండియా రేంజ్ ను దక్కించుకుంది. రౌడీ బేబీ పాట యూట్యూబ్ లో ఒక సెన్షేషన్ అని చెప్పుకోవచ్చు. వంద మిలియన్ ల వ్యూస్ ను దక్కించుకున్న రౌడీ బేబీ పాటలో ఆమె డాన్స్ అదుర్స్ అంటూ నెటిజన్స్ ఫిదా అయ్యారు.
హీరోలకు గట్టి పోటీ ఇస్తూ డాన్స్ చేసే ఈ అమ్మడు నటన విషయంలో ఎక్కడ రాజీ పడదు. షాట్ బాగా వచ్చేందుకు ఎంత కష్టపడేందుకు అయినా రెడీ అవుతుంది. ఇదే సమయంలో ఈమె హీరోల పట్ల అగౌరవంగా ఉంటుందని.. ఈమె నటించిన పలువురు హీరోలతో గొడవలు ఉన్నాయంటూ విమర్శలు ఎదుర్కొంది. పారితోషికం కోసం కాకుండా మంచి నటి అనిపించుకునేందుకు సినిమాలు చేస్తున్న రౌడీ బేబీ సాయి పల్లవి పుట్టిన రోజు నేడు. ఈ సందర్బంగా విరాటపర్వం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఆ సినిమాతో మరోసారి సాయి పల్లవి ఆకట్టుకోవడం ఖాయం అని ఫస్ట్‌లుక్ చూస్తుంటే అనిపిస్తుంది.