Begin typing your search above and press return to search.

ఈషా బ‌ర్త్ డే.. చిలౌట్ చేసిన న‌ట‌వార‌సురాళ్లు

By:  Tupaki Desk   |   19 April 2021 10:31 AM GMT
ఈషా బ‌ర్త్ డే.. చిలౌట్ చేసిన న‌ట‌వార‌సురాళ్లు
X
టాలీవుడ్ అందాల న‌టి ఈషా రెబ్బా ఈ రోజు తన పుట్టినరోజు జరుపుకుంది. త‌మ ఫేవ‌రెట్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ అభిమానులు ఫాలోవ‌ర్స్ తమ ట్విట్టర్ ఖాతాల్లో జోరు చూపించారు. ప్ర‌తిభ‌.. అందం ఒకే మూస‌లో పోస్తే ఈషా అంటూ కొంద‌రు త‌మ అభిమానం చాటుకున్నారు. #HBDEeshaRebba అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో ట్రెండింగ్‌లో ఉంది. తెలుగ‌మ్మాయి ఈషాపై కురుస్తున్న ఈ ప్రేమను అపార‌మైన అభిమానం చూస్తే ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క మాన‌దు.

ఈషా రెబ్బా మోడల్ గా తన కెరీర్ ను ప్రారంభించి ఆ తరువాత తెలుగు- తమిళ భాషా చిత్రాలలో ప్రముఖ నటిగా స్థిరపడింది. ఈషా 2012 లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంతో టాలీవుడ్ లో తొలి అడుగు వేసింది. ప‌రిశ్ర‌మ‌లో వాణిజ్యపరంగా విజయవంతమైన కొన్ని చిత్రాల్లో ఆమె నటించింది. అంత‌కుముందు ఆ త‌ర‌వాత‌- అమీ తూమి-అ!- అరవింద సమేత వీర రాఘవ- రాగాల 24 గంటల్లో చిత్రాల‌తో న‌టిగా ఆక‌ట్టుకుంది. అఖిల్ అక్కినేని న‌టిస్తున్న‌ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ .. తమిళ చిత్రం ఆయిరామ్ జెంమంగల్ చిత్ర‌ల్లో ఈషా కనిపించనుంది.

ఈ రోజు ఈషాకు స్పెష‌ల్ డే. త‌న బ‌ర్త్ డేను కూడా చాలా స్పెష‌ల్ గా జ‌రుపుకుంద‌ని తాజాగా రిలీజైన ఇన్ స్టా వీడియో వెల్ల‌డిస్తోంది. ఈ వీడియోలో సాటి క‌థానాయిక‌లు శివానీ రాజ‌శేఖ‌ర్- శివాత్మిక రాజ‌శేఖ‌ర్ త‌న‌ని గ‌ట్టిగా హ‌గ్ చేసుకుని పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. అలాగే ఇషా స్పెష‌ల్ అవెంజ‌ర్ టీష‌ర్ట్ ధ‌రించి ఎంతో బ్యూటిఫుల్ గా న‌వ్వుతున్న ఓ ఫోటో ఫ్యాన్స్ లో వైర‌ల్ అవుతోంది. ఇక ఈ ఫోటోలో రెండు జ‌డ‌లతో తెలుగు నేటివిటీని ఈషా ప్ర‌తిబింబించిన తీరు ఆక‌ట్టుకుంది. నేటితో ఇషాకు 31 వ‌సంతాలు.