Begin typing your search above and press return to search.

#HBD రావిపూడి.. `ఎఫ్ 3` లాంచ్ డేట్ ఫిక్స్.. స‌ర్వం సిద్ధం!!‌

By:  Tupaki Desk   |   23 Nov 2020 9:30 AM IST
#HBD రావిపూడి.. `ఎఫ్ 3` లాంచ్ డేట్ ఫిక్స్.. స‌ర్వం సిద్ధం!!‌
X
జంధ్యాల‌ మార్కు కామెడీని ఈవీవీ త‌రువాత ఆ స్థాయిలో అందిస్తూ త‌న చిత్రాల‌తో అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని ఎంట‌ర్ టైన్ ‌చేస్తున్న ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి. ఏ స్టార్ హీరోతో సినిమా చేసిన త‌న‌దైనా మార్కు కామెడీని పండించ‌డం త‌న‌కే చెల్లిన‌ ప్ర‌త్యేక‌త‌. న‌వ‌త‌రం డైరెక్ట‌ర్ ల‌లో ఎన‌ర్జిటిక్ డైరెక్ట‌ర్ గా అనిల్ రావిపూడి సుస్థిర‌మైన స్థానం సొంతం చేసుకుని స‌త్తా చాటుతున్నార‌నే చెప్పాలి. ఆయ‌‌న‌ని ద‌గ్గ‌గా చూసినవారు అభిమానులు చెప్పే మాట ఇది.

కామెడీ సినిమాల‌కు రావిపూడి కేరాఫ్ అడ్రెస్. ఎంచుకునే క్యారెక్ట‌ర్ల‌తోనే ఓ ప్ర‌త్యేక‌తను ఆపాదించి వినోదాన్ని పుష్క‌లంగా అందించ‌గ‌లిగే న‌వ‌త‌రం ద‌ర్శ‌కుడిగా అత‌డికి ప్ర‌త్యేక ఇమేజ్ ఉంది. క‌మ‌ర్షియ‌ల్ సినిమా ట్రెండ్ ని ప్రేక్ష‌కుల నాడిని క్యాచ్ చేసిన అనిల్ రావిపూడి మారిన అభిరుచికి త‌గ్గ‌ట్టుగా సినిమాలు చేస్తూ వ‌రుస విజ‌యాల్ని సాధిస్తున్నారు. మాస్ క్లాస్ అనే తేడా లేకుండా అన్ని వ‌ర్గాల్ని ఆక‌ట్టుకునే సినిమాల్ని అందించ‌డం రావిపూడి స్పెషాలిటీ.

`ప‌టాస్` నుంచి `స‌రిలేరు నీకెవ్వ‌రు` వ‌ర‌కు వ‌రుస హిట్ ‌ల‌ని ద‌క్కించుకున్నారు. ఐదు వ‌రుస విజ‌యాలతో వంద‌శాతం స‌క్సెస్ ద‌క్కించుకున్న ద‌ర్శ‌కుడిగా రికార్డుల‌కెక్కారు రావిపూడి. తాజాగా మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాని అందించేందుకు స‌ర్వ స‌న్నాహ‌కాల్లో ఉన్నారు. ఫ్యామిలీ ఎమోష‌న్స్ కు కామెడీని జోడీంచి అనిల్ రావిపూడి తెర‌కెక్కించిన హిలేరియ‌స్ ఫ్యామిలీ ఎంట‌ర్ ‌టైన‌ర్ `ఎఫ్ 2` కి సీక్వెల్ రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ‌కు టీమ్ రెడీ అవుతోంది. ఎఫ్ 2 బాక్సాఫీస్ వ‌ద్ద‌ వంద కోట్లు వ‌సూళు చేసి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ‌గా నిలిచింది. ఈ సూప‌ర్ హిట్ ఫ్యామిలీ డ్రామాని దిల్ రాజు నిర్మించ‌గా విక్ట‌రీ వెంక‌టేష్‌- వ‌రుణ్ ‌తేజ్ హీరోలుగా న‌టించారు. త‌మ‌న్నా.. మెహ‌రీన్ లు ఎఫ్ 2కి ప్ర‌ధాన గ్లామ‌ర్ గా ఆక‌ట్టుకున్నారు.

ఇప్పుడు అంత‌కుమించి గ్లామ‌ర్ ని యాడ్ చేస్తూ ముగ్గురు హీరోల‌తో తాజా సీక్వెల్ ని `ఎఫ్‌3` టైటిల్ తో తెర‌కెక్కించ‌నున్నారు. ఈ సీక్వెల్ తో మ‌ళ్లీ డ‌బుల్ ట్రీటిచ్చేందుకు న‌వ్వించ‌డానికి ట్యాలెంటెడ్ రావిపూడి రెడీ అవుతున్నారు. ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ ‌తో మ‌రోసారి బాక్సాఫీస్ వ‌ద్ద మ్యాజిక్ చేసేందుకు రెడీ అవుతున్నారు అనీల్. డిసెంబ‌ర్ 14 నుంచి చిత్రీక‌ర‌ణ‌ ప్రారంభిస్తున్న‌ట్టు అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చారు.

దిల్‌రాజు ఇప్ప‌టికే ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ ఫైన‌ల్ చేసి అవ‌స‌రం మేర బిగ్ బ‌డ్జెట్ ‌ని ఫిక్స్ చేశార‌ట‌. ఇందులోనూ వెంక‌టేష్- వ‌రుణ్ తేజ్ న‌టించ‌బోతున్నారు. అలాగే మూడో హీరోని యాడ్ చేయ‌నున్నార‌ని స‌మాచారం. ఇందులోనూ త‌మ‌న్నా.. మెహ‌రీన్ న‌టిస్తారా లేక వారి స్థానంలో వేరేవాళ్ల‌ని తీసుకుంటారా అన్న‌ది తెలియాల్సి వుంది. ఇక మ‌రో ఎఫ్ ఏంటి? ఎవ‌రు అన్న విష‌యంలోనూ స్ప‌ష్ట‌త రావాల్సి వుంది. నేడు ట్యాలెంటెడ్ డైరెక్ట‌ర్ అనీల్ రావిపూడి బ‌ర్త్ డే సంద‌ర్భంగా `తుపాకి` త‌ర‌పున శుభాకాంక్ష‌లు.