Begin typing your search above and press return to search.

క్షమాపణ చెప్పిన హనుమాన్‌ డైరెక్టర్‌

By:  Tupaki Desk   |   27 Nov 2022 12:30 PM GMT
క్షమాపణ చెప్పిన హనుమాన్‌ డైరెక్టర్‌
X
తేజ సజ్జా హీరో గా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన హనుమాన్ సినిమా యొక్క టీజర్ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు ఇంత చిన్న బడ్జెట్ తో అంత అద్భుతమైన ఔట్పుట్ ఎలా తీసుకు రాగలుగుతున్నారు అంటూ అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

తెలుగులోనే కాకుండా ఈ సినిమా ఖచ్చితంగా అన్ని భాషల్లో కూడా సంచలన విజయాన్ని నమోదు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అంటూ సినీ విశ్లేషకులు కొందరు మాట్లాడుకుంటున్నారు.

సినిమా యొక్క టీజర్ యూట్యూబ్ మరియు ఇతర సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్నాయి. ఈ సమయంలో దర్శకుడు ప్రశాంత్ వర్మ క్షమాపణలు చెప్పడం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

ఇటీవల ఆయన టీజర్ విడుదల సందర్భంగా మాట్లాడుతూ రామాయణాన్ని పురాణం అంటూ వ్యాఖ్యలు చేశారు. తన వ్యాఖ్యలను గురించి మళ్లీ స్పందిస్తూ.. రామాయణాన్ని పురాణం అన్నందుకు క్షమించండి అంటూ సోషల్ మీడియా వేదికగా కోరాడు.

నా ప్రసంగంలో పురాణం అనే పదాన్ని ఉపయోగించినందుకు క్షమించండి, రామాయణం మన చరిత్ర అంటూ ఆయన పేర్కొన్నాడు. ఈ సినిమా తప్పకుండా ప్రతి ఒక్క ప్రేక్షకుడికి నచ్చే విధంగా ఉంటుందని ప్రశాంత్ వర్మ ధీమా వ్యక్తం చేశాడు. రామాయణం ఒక చరిత్ర అని.. ఆ చరిత్ర మనకు ఎన్నో విషయాలను తెలియజేస్తుందని సోషల్ మీడియాలో హనుమాన్ గురించి చర్చ మరో సారి జరుగుతోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.