Begin typing your search above and press return to search.

అఖిల్ సెకండ్.. ఇదైనా ఫైనల్ అవుద్దా?

By:  Tupaki Desk   |   10 Jun 2016 5:00 PM IST
అఖిల్ సెకండ్.. ఇదైనా ఫైనల్ అవుద్దా?
X
అక్కినేని అఖిల్ రెండో సినిమా ఏది? ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఈ ప్రశ్నలకు ఆన్సర్ అంత సింపుల్ ఏమీ కాదు. బాహుబలిని కట్టప్ప ఎందుకు పొడిచాడో అయినా ఊహించచ్చేమో కానీ.. అఖిల్ రెండో సినిమా ప్రారంభ ముహూర్తంపై మాత్రం సస్పెన్స్ వీడడం లేదు. ఇప్పటికైతే ఓ న్యూస్ బయటకొచ్చింది. యథావిధి గానే త్వరలోనే అఖిల్ సెకండ్ ను అనౌన్స్ చేయనున్నారట.

కృష్ణగాడి వీర ప్రేమగాధతో సక్సెస్ అందుకున్నాక దర్శకుడు హనురాఘవపూడి జూనియర్ ఎన్టీఆర్ కి ఓ కథ చెప్పాడు. స్టోరీ నచ్చినా.. కమర్షియల్ మూవీని హ్యాండిల్ చేయడంలో హను వీక్ అని భావించిన జూనియర్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు నిరాకరించాడు. ఇప్పుడు అఖిల్ తో రెండో సినిమా హను రాఘవపూడి డైరెక్ట్ చేయనున్నాడనే న్యూస్ బాగా స్ప్రెడ్ అవుతోంది.

కొన్నాళ్ల క్రితం ఎన్టీఆర్ కి చెప్పి ఒప్పించలేకపోయిన కథనే.. కొంచెం అటూఇటూ చేసి హను అఖిల్ కి చెప్పాడని తెలుస్తోంది. ఈ లవ్ స్టోరీ నచ్చడంతో.. అఖిల్ కూడా సుముఖంగానే ఉన్నాడట. అయితే.. కొన్ని కీలకమైన సీన్స్ విషయంలో ఇంకా క్లారిటీ కావాల్సి ఉండి పచ్చజెండా ఊపలేదని తెలుస్తోంది. త్వరలో వీరిద్దరూ మరోసారి స్టోరీ సిట్టింగ్ కి కూర్చుని.. ప్రాజెక్టును ఫైనల్ చేసే అవకాశాలున్నాయి. అన్నీ ఓకే అనుకున్నాక.. నాగార్జునతో ఓ అఫీషియల్ స్టేట్ మెంట్ ఇప్పించే పనిలో ఉన్నాడు అఖిల్ అక్కినేని.