Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ కథను అఖిల్‌ చేస్తున్నాడా??

By:  Tupaki Desk   |   22 May 2016 10:54 AM GMT
ఎన్టీఆర్ కథను అఖిల్‌ చేస్తున్నాడా??
X
ఒక్కోసారి అంతే. ఒక హీరో కోసం రాసుకున్న కథ మరో హీరో చేసే ఛాన్సుంటుంది. అయితే ఆ సినిమాలు బ్లాక్ బస్టర్లూ అవుతుంటాయి.. మిస్సులూ అవుతుంటాయి. ఇప్పుడు అలాంటి ఓ కథే యంగ్‌ హీరో అఖిల్‌ దగ్గరకు వచ్చిందంటున్నారు సన్నిహితులు.

అందాల రాక్షసి సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన హను రాఘవపూడి.. ఆ తరువాత నాని హీరోగా 'కృష్ణగాడి వీర ప్రేమ గాధ' సినిమా తీశాడు. రెండు సినిమాలూ కమర్షియల్‌ గా సక్సెస్‌ కాకపోయినా కూడా.. వాటిలో డైరక్టర్ గా మనోడు ఎంతో ట్యెలంట్‌ చూపించాడని అందరూ పొగిడారు. ఆ కిక్‌ తో ఇప్పుడు జూ.ఎన్టీఆర్ దగ్గరకు ఒక లవ్‌ స్టోరీ చెప్పాడట హను. కాకపోతే ఎన్టీఆర్‌ ఫైనల్‌ గా ఆ కథను రిజక్టు చేయడంతో దాన్ని ఇప్పుడు అఖిల్ కు వినిపించినట్లు తెలుస్తోంది. ఆ కథ అఖిల్‌ కు బాగా నచ్చిందట. ఒకవేళ నాగ్‌ కనుక గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తే.. వెంటనే ఈ ప్రేమ కథను మొదలెట్టేస్తారని టాక్‌.

సర్లేండి.. ఏదేమైనా కూడా.. అఖిల్ కొత్త సినిమా మొదలవుతుందంటే అందరికీ ఆనందమే.