Begin typing your search above and press return to search.

హన్సికకు బ్లడ్ టెస్ట్.. ఉత్తుత్తినే!!

By:  Tupaki Desk   |   30 Nov 2015 4:02 PM IST
హన్సికకు బ్లడ్ టెస్ట్.. ఉత్తుత్తినే!!
X
బొద్దు భామ హన్సిక పొద్దు పొద్దున్నే ఫ్యాన్స్ ని హడలెత్తించేసింది. పరీక్ష కోసం రక్తం తీస్తుంటే తెగ ఏడ్చేశానని.. తల్లి సముదాయించండతో కాస్త ఆపుకున్నానని ట్వీట్ చేయడంతో.. ఫ్యాన్స్ లో ఆందోళన ఆసక్తి మొదలైపోయాయి.

ఇంతకీ హన్సికకు ఏమైంది.. ఎందుకు బ్లడ్ టెస్ట్ చేయించుకోవాల్సి వచ్చింది.. ఆరోగ్యం బాగానే ఉందా.. షూటింగ్ లో ఏమన్నా యాక్సిడెంట్ జరిగిందా.. ఏమైనా సీరియస్సా.. ఇప్పుడు ఓకే కదా.. ఆందోళన చెందాల్సింది ఏమన్నా ఉందా.. ఇప్పుడు ఓకేనా.. ఇలా తెగ ట్వీట్స్ మీద ట్వీట్ వచ్చి పడ్డాయి. దీంతో తన అభిమానులను ఇంకా ఏడిపించడం ఇష్టం లేక అసలు విషయం చెప్పింది హన్సిక. కేవలం రెగ్యులర్ చెకప్ లో భాగంగానే బ్లడ్ టెస్ట్ చేయించుకున్నానని.. అందోళన చెందాల్సిన అవసరం లేదని మరోసారి ట్వీట్ చేసిన హన్సిక.. ఆందోళన అవసరం లేదని, భయపడాల్సిన పని లేదని చెప్పింది. పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని, ఎవరూ కంగారు పడద్దని అభిమానులను సముదాయించిందీ భామ. దీంతో విశ్రాంతి తీసుకోవాలని, ఆరోగ్యం చాలా ముఖ్యమంటూ సలహాలు మొదలైపోయాయి.

మొత్తానికి తెల్లవారుతూనే హన్సిక చేసిన హడావిడి ఆన్ లైన్ లో హాట్ టాపిక్ అయిపోయింది. అయితే.. భయపడాల్సిన అవసరం లేకపోవడంతో.. కాస్త కుదురుకున్నారు ఫ్యాన్స్. ఏమైనా హన్సికా ఇది టూమచ్.. కాస్త ఆ విషయమేంటో ముందో చెబితే.. ఇంత హడావిడి ఉండేది కాదు కదా. కాస్త నీ మీదే అభిమానం పెంచుకున్న ఫ్యాన్స్ విషయం కూడా కాస్త ఆలోచించాలి కదా.