Begin typing your search above and press return to search.
బొద్దు బ్యూటీలో ఈ యాంగిల్ కూడా ఉందా
By: Tupaki Desk | 20 Jan 2016 10:36 PM ISTసినిమా హీరోయిన్లు ఖాళీ సమయాల్లో ఏం చేస్తుంటారు? దీనికి ఆన్సర్ పెద్ద కష్టమేం కాదు లెండి. ఏముంది.. ఎంచక్కా టూర్లు కొడుతుంటారు, లేదా షాపింగులు చేస్తుంటారు. నెక్ట్స్ మూవీలో కొత్త ఫ్యాషన్ డ్రస్సుల గురించి డిస్కషన్స్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ చాలామంది విషయంలో నిజమే కానీ.. దేశముదురు భామ హన్సిక మాత్రం కొంచెం తేడా.
హన్సికకి కాస్తంత ఫ్రీ టైం దొరికితే చాలు పెయింట్ బ్రష్ పట్టుకుని బొమ్మలు వేసేస్తుంటుంది. బొమ్మలంటే ఏవో పేపర్ల మీద గీసేసే నాలుగు పిచ్చి గీతలు కాదు.. ఇష్టమొచ్చినట్లుగా గీతలు గీసేసి ఇదే ఆబ్ స్ట్రాక్ట్ పెయింటింగ్ అని కూడా అనదు. ఎంతో ఇష్టంతో, మమకారంతో తన మనుసులో భావాలను కాన్వాస్ మీద పదిలపరుస్తూ ఉంటుంది హన్సిక. ఈ పెయింటింగ్స్ భద్రంగా జాగ్రత్త పరుస్తూ ఉంటుంది. మళ్లీ పెయింటింగ్స్ అంటే సల్మాన్ ఖాన్, శ్రీదేవిల టైపులో.. వాళ్లు గీశారు కాబట్టి సూపర్ అనక్కర్లేదు. ఇవి నిజంగానే చాలా బాగుంటాయ్ కూడా.
తన ఖాళీ సమయాల్లో గీసిన పెయింటింగ్స్ ను వేలం పెట్టాలని అనుకుంటోంది ఈ బొద్దు భామ. అలా వచ్చిన డబ్బును అనాథలైన పిల్లలకు, సీనియర్ సిటిజన్స్ కు ఉపయోగించాలన్నది ఈమె ఆలోచన. ఇప్పటికే ఈమె 20కి పైగా పిల్లల బాధ్యతను చూసుకుంటోంది. అంతే కాదు ప్రతీ పుట్టిన రోజున ఒక చిన్నారిని దత్తత తీసుకుంటోంది కూడా. ఇప్పుడు పెయింటింగ్స్ ద్వారా వచ్చిన డబ్బును కూడా ఛారిటీకే ఉపయోగిస్తానంటోంది. అందంగా కనిపించే హన్సికకు అంత కంటే అందమైన మనసు, మానవత్వం ఇచ్చాడు ఆ భగవంతుడు అంటారు ఆమెతో సాయం పొందినవాళ్లు.