Begin typing your search above and press return to search.

తెలుగులో ఒక్కటి కూడా లేదండీ

By:  Tupaki Desk   |   27 Jan 2016 4:00 AM IST
తెలుగులో ఒక్కటి కూడా లేదండీ
X
బూరె బుగ్గల చిన్నది.. పాల సొగసుల వన్నెది.. హన్సిక మొత్వాని. చిన్ననాటి నుండే నటిగా ఆకట్టుకున్న ఈ కుర్రది.. పూరి జగన్‌ తీసిన దేశముదురు సినిమాతో స్టార్‌ హీరోయిన్‌గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. విపరీతమైన అందాలను ఆరపోసింది. మిల్కీ వైట్‌ లుక్కుతో కట్టిపాడేసింది. అయినా ఏం లాభం.. తెలుగులో ఆమెను పెద్దగా చూసిందే లేదు.

కట్‌ చేస్తే.. చెన్నయ్‌ ఫ్లయిట్‌ ఎక్కేసిన హన్సిక.. అక్కడ రచ్చ చేయడం స్టార్ట్ చేసింది. పెద్ద పెద్ద స్టార్లు ఈమెను పిలిచీ మరీ సెకండ్‌ హీరోయిన్ ఛాన్సులివ్వగా.. చిన్న చిన్న స్టార్లందరికీ ఈమే స్టార్‌ హీరోయిన్‌. ఇప్పుడు 'కళావతి' అంటూ వస్తున్న డబ్బింగ్‌ సినిమా 'అరణ్మయి 2' లో హన్సికే హీరోయిన్‌. తెలుగులో అస్సలు కనిపించట్లేదేంటి పాపాయ్‌ అని అడిగితే.. ''అదేం లేదండి. కుదరట్లేదు అంతే. ఇప్పటికిప్పుడు తమిళంలో చేతిలో 4 సినిమాలున్నాయి. తెలుగులో మాత్రం ఏమీ లేవు. ఎందుకూ అంటే చెప్పలేను'' అని సెలవిచ్చింది.

సర్లేండి.. ఇక అమ్మడు ఈ కళావతి సినిమా కోసం మాత్రం గ్లామర్‌ రూటును వదిలేసి.. ఒక ప్రెగ్నెంట్‌ అమ్మాయిగా నటిస్తోందట. మరి ఆడియన్స్‌ ఎలా రిసీవ్‌ చేసుకుంటారో చూద్దాం.