Begin typing your search above and press return to search.

హన్సిక ఆ టైపు కాదట!

By:  Tupaki Desk   |   12 April 2015 3:00 PM IST
హన్సిక ఆ టైపు కాదట!
X
సినిమాల్లో నటించేది ఎందుకు అంటే.. డబ్బు కోసం అని వచ్చే సమాదానాలే ఎక్కువ ఉంటాయి అనడంలో సందేహం లేదు! కానీ... తను మాత్రం అసలు డబ్బు కోసం వెంపర్లాడే టైపు కాదంటుంది బూరు బుగ్గల చిన్నది హన్సిక! నయనతార తర్వాత కోలీవుడ్‌లో అత్యధిక అవకాశాలు చేతిలో ఉన్న హీరోయిన్స్ లో హన్సికదే నెస్ట్ ప్లేస్! అరణ్మణై, ఆంబళ అంటూ వరుస విజయాలను సొంతం చేసుకుంటున్న ఈ బ్యూటీ మాజీ ప్రియుడు శింబుతో నటించిన వాలు చిత్రం మేలో తెరపైకి రానుంది. శింబుతో జత కట్టిన వేట్టైమన్నన్‌తో పాటు జయంరవితో నటిస్తున్న రోమియో జూలియట్, నటి జయప్రద కొడుకు సిద్ధార్థ్ సరసన నటిస్తున్న ఉయిరే ఉయిరే, ఇళయదళపతి విజయ్‌కి జంటగా నటిస్తున్న పులి, ఉదయనిధి స్టాలిన్‌తో కలసి నటిస్తున్న ఇదయం మురళి... ఇలా సుమారు అరడజను చిత్రాలకుపైగా నటిస్తూఉ ఏడాదికి సరిపడా బిజీ అయిపోయింది!
గుండ్రటి రూపం, చక్కని అభినయంతోపాటు అందాలు ఆరబోయడానికి ఏమాత్రం వెనకడుగేయకపోవడం వెరసి హన్సికకు అవకాశాలు వద్దన్నా తలుపు తడుతున్నాయంటున్నాయట! ఈ సమయంలో డబ్బు గురించి సంచల వ్యాఖ్యలు చేసింది హన్సిక! "అందరూ డబ్బు సంపాదన కోసమే కఠినంగా శ్రమిస్తుంటారు కానీ... తాను మాత్రం సంపాదనే ధ్యేయంగా భావించడం లేదంటుంది"... తనకు అవసరం అయిన విషయాలను అమ్మ చూసుకుంటుంది కాబట్టి అతిగా ఆశపడను అని చెబుతుంది ఈ దేశముదురు చిన్నది!