Begin typing your search above and press return to search.

ఆమె చేతిలో పది ప్రాజెక్ట్‌ లు

By:  Tupaki Desk   |   5 Jan 2022 8:00 AM IST
ఆమె చేతిలో పది ప్రాజెక్ట్‌ లు
X
దేశ ముదురు సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన హన్సిక ఈమద్య కాలంలో ఎక్కువ తమిళ సినిమాలకే పరిమితం అయ్యింది. ఆమె నటించిన తమిళ సినిమాలు తెలుగు లో డబ్‌ అవ్వడం లేదా చిన్న సినిమాలు ఏమైనా ఆమె తెలుగు లో నటించినవి విడుదల అవ్వడం జరుగుతుంది కాని టాలీవుడ్‌ లో ఆమె అంత యాక్టివ్‌ గా ఉన్నట్లుగా అనిపించడం లేదు. గడచిన మూడు నాలుగు సంవత్సరాలుగా ఆమె టాలీవుడ్‌ పై ప్రత్యేక శ్రద్ద పెట్టకున్నా కూడా తెలుగు ప్రేక్షకులు మాత్రం ఆమెను మర్చి పోలేదు.. ఆమెను అభిమానిస్తూనే ఉన్నారు. సోషల్‌ మీడియాలో ఆమె గురించిన చర్చ రెగ్యులర్ గా ఏదో ఒక విధంగా జరుగుతూనే ఉంటుంది. తాజాగా న్యూయర్‌ సందర్బంగా మీడియాతో మాట్లాడిన హన్సిక ఆసక్తికర విషయాలను షేర్‌ చేసింది.

హన్సిక మాట్లాడుతూ.. గత ఏడాది ప్రతి ఒక్కరికి కూడా కష్టంగానే గడిచింది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ గత ఏడాది ఇబ్బందులు ఎదుర్కొంది. ఈ సమయంలో ఇండస్ట్రీలో ఉన్న వారు ఎదుర్కొన్న సమస్యలు అన్ని కూడా తొలగి పోవాలని ఆశిస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది. గత ఏడాది నాకు తోడుగా ఉన్న ఇండస్ట్రీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు చెప్పిన హన్సిక రాబోయే రెండేళ్లలో వరుస సినిమాలతో బిజీగా ఉండబోతున్నట్లుగా చెప్పుకొచ్చింది. గత ఏడాది నుండి తన సినిమాలు మేకింగ్‌ అవుతున్నాయి కాని విడుదలకు నోచుకోలేదు. అందుకే ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ సినిమా లను విడుదల చేసే ఉద్దేశ్యంతో ఉన్నట్లుగా చెప్పుకొచ్చింది.

ఆమె చెప్పిన దాని ప్రకారం ఏకంగా 9 సినిమాల్లో ఆమె నటిస్తూ.. నటించబోతూ ఉందట. అందులో కొన్ని సినిమాలు షూటింగ్‌ పూర్తి అవ్వగా మరికొన్ని షూటింగ్‌ ఆరంభ దశలో కొన్ని ముగింపు దశలో ఉన్నాయి. మొత్తానికి ఆమె 9 సినిమాలు ఈ ఏడాది లో కొన్ని వచ్చే ఏడాదిలో మరి కొన్ని విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో ప్రముఖ ఓటీటీ లో ఈమె వెబ్‌ సిరీస్ ద్వారా ఈ ఏడాది ప్రేక్షకులను ఎంటర్‌ టైన్‌ చేయబోతుందట. మొత్తానికి ఈ అమ్మడి జోరు చూస్తుంటే అంతా కూడా ఇంత కరోనా కాలంలో కూడా ఇన్ని సినిమాలు ఎలా చేస్తున్నావు అమ్మడు అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.