Begin typing your search above and press return to search.

ర‌హ‌స్య స్నేహితుడితో మాల్దీవుల్లో ఆపిల్ బ్యూటీ?

By:  Tupaki Desk   |   20 Dec 2020 9:00 AM IST
ర‌హ‌స్య స్నేహితుడితో మాల్దీవుల్లో ఆపిల్ బ్యూటీ?
X
ఆపిల్ బ్యూటీ హ‌న్సిక మోత్వానీ ప్ర‌స్తుతం లోన్ లీ స్టాటస్ ని ఎంజాయ్ చేస్తున్నారా? శింబు నుంచి విడిపోయిన త‌ర్వాత ఈ అమ్మ‌డి ప‌రిస్థితి ఏమిటి? అంటే.. అందుకు స‌రైన స‌మాధానం లేదు.

అయితే ఈ భామ ప్ర‌స్తుతం మాల్దీవుల విహారంలో ఫుల్ చిలౌట్ మూడ్ లో ఉంది. అక్క‌డ త‌న కుటుంబ స‌భ్యులు ఉన్నారు. తన తల్లి మోనా మోత్వానీ .. సోదరుడు ప్రశాంత్ మోత్వానీలతో కలిసి మాల్దీవుల్లో విహారాన్ని హ‌న్సిక ఆస్వాధిస్తోంది.

తాజాగా హ‌న్షిక త‌న ఫోటోల‌ను షేర్ చేసింది. మత్స్యకన్యను త‌ల‌పించేలా ద్వీపంలో ఓ రేంజులోనే సంద‌డి చేస్తోంద‌ని అర్థ‌మ‌వుతోంది. రెండు రోజుల క్రితం హన్సిక తన కుటుంబ సభ్యులతో కలిసి మాల్దీవులకు విమానంలో ప్రయాణించి,.. సీప్లేన్ ద్వారా వారి రిసార్ట్ కు చేరుకుంది.

హన్సిక తన కుటుంబ సభ్యులతో కలిసి మాల్దీవుల్లో అడుగుపెట్టినప్పటి నుండి ఫోటో షేరింగ్ తో గుబులు రేపుతోంది. నిన్న ఆమె పింక్ స్పఘెట్టి క్రాప్ టాప్ థై-హై స్లిట్ ఫ్లోరల్ స్కర్ట్ ధరించింది.

``నిజ‌మైన మత్స్యకన్య`` అంటూ హ‌నీ అదిరిపోయే క్యాప్ష‌న్ తో క‌వ్వించింది. మాల్దీవుల్లో దిగిన రోజున హన్సిక తన సోదరుడు ప్రశాంత్ తో కలిసి ఇన్ ‌స్టాగ్రామ్ ‌లో ర‌క‌ర‌కాల వీడియోల్ని షేర్ చేసింది. అందులో హ‌నీ హుషారుగా డ్రమ్స్ వాయిస్తున్న బిల్డ‌ప్ ఇస్తుంటే ప్ర‌శాంత్ విసుక్కుంటున్నాడు. ప్రశాంత్ తన సోదరి ప్రవర్తనతో కోపంగా ఉన్నాడు. అన్న‌ట్టు ఈసారి మాల్దీవుల ట్రిప్ లో ర‌హ‌స్య స్నేహితుడు ఎవ‌రైనా ఉన్నారా.. ? అంటే లేనే లేరు. శింబుతో క‌టీఫ్ త‌ర్వాత వేరొక‌రితో హ‌న్సిక ప్రేమ‌లో ప‌డ‌లేదు మ‌రి.

కెరీర్ సంగ‌తి చూస్తే .. తాజాగా హన్సిక త‌న కెరీర్ మైలు రాయి సినిమా (50 వ ఫిల్మ్) `మహా` పూర్తి చేసింది. ఈ చిత్రానికి యు ఆర్ జమీల్ ద‌ర్శ‌కుడు. ఇందులో హ‌న్సిక మాజీ ప్రియుడు శింబు పైలట్ పాత్రను పోషిస్తుండ‌డం ఆస‌క్తిక‌రం. అత‌డు ఫ్లాష్ బ్యాక్ లో క‌నిపిస్తారు.


వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : https://www.instagram.com/p/CI4kABnnLNp/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again