Begin typing your search above and press return to search.
#హన్సిక.. గాల్లో ఎగురుతూ నీటిపై తేలే సాహసం
By: Tupaki Desk | 16 Dec 2020 4:08 PM ISTవెండితెరపై సాహసాలు ప్రయోగాలకు వెరవని కథానాయికగా హన్సికకు పేరుంది. సౌత్ లో అన్ని జోనర్ల సినిమాలలో నటిస్తున్న ఈ ఆపిల్ బ్యూటీకి ఎందుకనో ఇటీవల తెలుగులో చెప్పుకోదగ్గ ఆఫర్లు లేవు. దాంతో తమిళ పరిశ్రమకు అంకితమైంది.
అయితే అక్కడా కోస్టార్ శింబుతో లవ్ బ్రేకప్ తర్వాత కెరీర్ పరంగా వీక్ అయిపోయింది. ఇటీవల జయంరవి -అరవింద స్వామి కాంబో మూవీ భోగన్ లో నటించింది. ఆ తమిళ హిట్ చిత్రం తెలుగులోకి అదే పేరుతో అనువాదమైంది.
పనిలో పనిగా హన్సిక కెరీర్ 50వ సినిమా `మహా` చిత్రీకరణ పూర్తయింది. ఇందులో కాషాయం ధరించి యోగినిగా మారిన హన్సిక చైన్ స్మోకర్ గా దర్శనమిస్తున్న ఫోటోలు ఇదివరకూ వైరల్ అయ్యాయి. అలాగే బికినీ ట్రీట్ కి సిద్ధంగా ఉండమని చెబుతోంది. మహాలో వెండితెరపైనా హన్సిక బికినీతో హీట్ పెంచేందుకు సిద్ధమైంది. ఆ క్రమంలోనే బికినీ కోసం ఈ భామ కఠోరంగా శ్రమించి జీరో సైజ్ కి వచ్చేసింది.
ఇక వీలున్నప్పుడల్లా ఈ అమ్మడు విదేశీ బీచ్ లకు విహారానికి వెళుతోంది. అలా వెళ్లినప్పటి ఓ ఫోటోని తాజాగా షేర్ చేసింది. ఈ ఫోటోలో హావర్ క్రాఫ్ట్ మెట్లు ఎక్కుతూ కనిపించింది. గాల్లో ఎగురుతూ నీళ్లలోనూ దిగే ప్రత్యేక ప్లేన్ ఇది. దీనిపై జాలీగా సముద్ర విహారం చేస్తోంది హన్సిక. మరింత ఇంత డేరింగ్ గా హనీ ఫీట్ చూస్తుంటే భయం కలుగుతోంది కదూ?