Begin typing your search above and press return to search.

బ‌న్ని హీరోయిన్ అందాల ఎర‌

By:  Tupaki Desk   |   28 Oct 2021 9:30 AM IST
బ‌న్ని హీరోయిన్ అందాల ఎర‌
X
ఆపిల్ నిగ‌నిగ‌ల‌తో కుర్ర‌కారుని ఎట్రాక్ట్ చేసిన ముంబై బ్యూటీ హ‌న్సిక. బ‌న్నీ న‌టించిన `దేశ ముదురు` సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించిన ఈ అందాల సోయ‌గం పెద్ద స్టార్ అయిపోతుంద‌ని భావించారు. కానీ అనుకున్న‌దొక్క‌టి అయిన‌దొక్క‌టి. ప్ర‌స్తుతం తెలుగు ప్రేక్ష‌కులు పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేదు. ఇంకా క‌రెక్ట్ గా చెప్పాలంటే హ‌న్సిక‌ని తెలుగు ప్రేక్ష‌కులు మ‌రిచిపోయి చాలా కాల‌మే అవుతోంది. `ప‌వ‌ర్‌` త‌రువాత దాదాపుగా హ‌న్సిక కెరీర్ తెలుగులో ఎండ్ అయిపోయింది.

సందీప్ కిష‌న్ తో ఒక‌టి అర సినిమాల్లో క‌నిపించినా పెద్ద‌గా ఉప‌యోగం లేకుండా పోయింది. ప్ర‌స్తుతం `మ‌హా` చిత్రంలో న‌టిస్తున్న హ‌న్సిక తెలుగులో 105 మినిట్స్‌... మై నేమ్ ఈజ్ శృతి .. త‌మిళంలో రౌడీ బేబీ వంటి చిత్రాల్లో న‌టిస్తోంది. `మహా` పేరుతో రూపొందుతున్న ఈ మూవీలో హ‌న్సిక మాజీ ప్రియుడు శింబు కీల‌క అతిథి పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు.

ఇదిలా వుంటే హ‌న్సిక హాట్ ఫొటోషూట్ల‌తో సోష‌ల్ మీడియాల్లో హీటెక్కిస్తోంది. గ‌త కొంత కాలంగా త‌న అంద‌మైన ఆపిల్ సొగ‌సును కాపాడుకుంటూ మ‌రింత నాజూగ్గా ముస్తాబైన హ‌న్సిక బీచ్ అందాల మ‌ధ్య రెడ్ కల‌ర్ బికినీలో ఫొటోల‌కు పోజులిచ్చింది. సంధ్యా స‌మ‌యాన స‌రిగంగ స్నానాలాడుతూ పాల‌నురుగు దేహ‌శిరుల్ని ఆవిష్క‌రించింది హ‌న్సిక‌. ఈ ఫొటోలు ప్ర‌స్తుతం నెట్టింట సంద‌డి చేస్తున్నాయి. తెలుగులో ఎలాగైనా మ‌ళ్లీ స‌త్తా చాటాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్న హ‌న్సిక అందులో భాగంగానే అభిమానుల్ని ఆక‌ట్టుకునే ప‌నిలో ప‌డింది. ఈ క్ర‌మంలోనే అందాల ఎర వేస్తూ తెలుగు ప్రేక్ష‌కుల్ని ఫిదా చేసే ప‌నిలో హ‌న్సిక విశ్వ‌ప్ర‌య‌త్నాలే చేస్తోంది. ఈ విష‌యంలో హ‌న్సిక ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతుందో చూడాలి మ‌రి అంటున్నాయి ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు.