Begin typing your search above and press return to search.

అమ్మమ్మమ్మో! హాస్పిటల్‌లో చేర్పించారా?

By:  Tupaki Desk   |   14 July 2015 10:28 PM IST
అమ్మమ్మమ్మో! హాస్పిటల్‌లో చేర్పించారా?
X
పాలబుగ్గల సౌందర్యం హన్సికకు ఏమైంది? ఇంతలోనే హుటాహుటీన ఆస్పత్రిలో చేర్చాల్సినంత ఏమొచ్చింది? అసలింతకీ అంత ప్రమాదం ఏం జరిగింది? ఇలాంటి సందేహాలెన్నో అభిమానులకు కలగొచ్చు గాక.. ఆ సందేహ నివృత్తి కోసమే ఆరాతీస్తే కొన్ని ఆసక్తికర సంగతులు తెలిశాయి.

ఈ దేశముదురు భామ ఇప్పటికిప్పుడు వరుసగా రెండు సినిమాల్లో నటించేస్తోంది. క్షణం తీరిక లేని షెడ్యూళ్లతో ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి పరుగులు పెడుతోంది. ఓ వైపు విజయ్‌ సరసన పులి చిత్రంలో నటిస్తూనే మరోవైపు సుందర్‌.సి దర్శకత్వంలోని ఆరణ్మయి-2లో నటించడానికి ఉరుకులు పరుగులు పెడుతోంది. అయితే ఈ బిజీ జీవితంలో విపరీతమైన ఒత్తిడికి లోనయిన అమ్మడు ఉన్నట్టుండి సెట్‌లో శోష వచ్చి పడిపోయింది. తీవ్ర అనారోగ్యానికి గురైంది. వెంటనే కలత చెందిన ఆరణ్మయి టీమ్‌ హుటాహుటిన ఆస్పత్రిలోకి చేర్పించింది.

ఇకపోతే హనీ స్పీడ్‌గానే కోలుకుంటోంది. కొంత విశ్రాంతి అవసరమైంది అంతే. త్వరలోనే షూటింగుకి వచ్చేస్తోంది అంటూ చెప్పుకొచ్చారు. అన్నట్టు ఎంతకాలంగానో సెల్‌లో ఉండిపోయిన 'వాలు' రిలీజ్‌కి వస్తోంది. అది తలుచుకుని, మాజీ ప్రియుడిని గుర్తు చేసుకుని ఇలా పడిపోయిందా? ఏమో?!