Begin typing your search above and press return to search.

పాలబుగ్గల రాకుమారి ఇటు రావా?

By:  Tupaki Desk   |   5 Aug 2015 6:11 PM GMT
పాలబుగ్గల రాకుమారి ఇటు రావా?
X
ముసి ముసి నవ్వులతో మనసుకు గాలం వేసే అందం హన్సిక సొంతం. ఆ పాలబుగ్గల్లో నొక్కులు కుర్రకారు గుండెల్ని చిదిమేస్తాయి. అందుకే దేశముదురుతో కెరీర్‌ ప్రారంభించి దశాబ్ధం వరకూ సునాయాసంగా లాగించేసింది. ఇటీవలి కాలంలో తెలుగులో సినిమాలు తగ్గించుకుని తమిళ తంబీల్ని అలరించే పని పెట్టుకున్న హన్సిక .. ప్రస్తుతం వరుసగా కోలీవుడ్‌ సినిమాల్లో నటిస్తోంది.

లేటెస్టుగా ఆరణ్మయి 2లో సిద్ధార్థ్‌ సరసన నటించింది. త్వరలో ఈ చిత్రం రిలీజ్‌ కి రానుంది. కోలీవుడ్‌ లో 100కోట్ల బడ్జెట్‌ తో తెరకెక్కిన సినిమాగా పాపులర్‌ అయిన పులి చిత్రంలోనూ హన్సిక కథానాయిక. విజయ్‌ సరసన నటించిన పులి రిలీజ్‌ కి రెడీ అవుతోంది. ఈ చిత్రం విఎఫ్‌ ఎక్స్‌ ప్రధానాంశంగా తెరకెక్కించిన సినిమా. ఇందులో రాకుమారి పాత్రలో హన్సిక ఆకట్టుకోబోతోంది. ఇప్పటికే విజయ్‌ అభిమానుల్లో ఈ సినిమా ఫీవర్‌ రాజేసింది.

ఈలోగానే మరో క్రేజీ ప్రాజెక్టుకు సంతకం చేసింది హనీ. యువహీరో జీవా సరసన ఓ సినిమాలో నటించనుంది. రామ్‌ ప్రసాద్‌ రాయప్ప ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. అక్టోబర్‌ లో సినిమా ప్రారంభం కానుంది.