Begin typing your search above and press return to search.

వాహ్.. గోల్డెన్ బ్యూటీ

By:  Tupaki Desk   |   17 July 2017 12:20 PM IST
వాహ్.. గోల్డెన్ బ్యూటీ
X
లేలేత ప్రాయంలో ఉన్నప్పుడే టాలీవుడ్ లో అడుగు పెట్టి అందరి గుండెల్ని కొల్లగొట్టేసింది నార్త్ బ్యూటీ హన్సికా మోత్వానీ. తొలి సినిమా దేశముదురు తర్వాత ఆమె వెనుదిరిగి చూసిందీ లేదు.. అభిమానులను నిరాశ పరిచిందీ లేదు. కొన్నాళ్లగా తెలుగులో పెద్దగా హిట్లు రాకపోవడంతో చెన్నైకి మకాం మార్చేసి అక్కడ సెటిలయిపోయింది. తెలుగులో అడపాదడపాగానే సినిమాలు చేస్తోంది.

గోపీచంద్ హీరోగా నటించిన గౌతమ్ నందా సినిమాతో హన్సిక మరోసారి తెలుగు తెరపై కనిపిస్తోంది. లాంగ్ టైం గ్యాప్ తర్వాత తెలుగులో సినిమా చేస్తుండటంతో ఇక్కడి ప్రేక్షకులకు తనలోని గ్లామర్ కంటెంట్ గుర్తు చేసేలా హీటెక్కించే ఫోజులతో దర్శనమిస్తోంది. రీసెంట్ గా రిలీజైన గౌతమ్ నందా సినిమా స్టిల్స్ లో హన్సిక అందరి మతులు పోగొట్టేసింది. బంగారపు రంగు చీరకట్టులో వానలో తడుస్తూ వయ్యారంగా నడుచుకుంటూ వస్తున్న ఆమెను చూస్తే చలికాలంలోనూ చెమటలు పట్టడం ఖాయమన్నట్టుగా ఉంది. దేశముదురు భామ ఇంతవరకు తెలుగులో ఈ రేంజిలో అందాలు ఆరబోసింది లేదు. దీంతో గౌతమ్ నందా సినిమాకు హన్సిక గ్లామర్ స్పెషల్ అస్సెట్ గా అయ్యేలానే ఉంది.

గౌతమ్ నందా డైరెక్టర్ సంపత్ నంది ఇంతకుముందు రచ్చ సినిమాలో వాన పాటతో తెరపై తమన్నా అందచందాలను ఆరబోసి ప్రేక్షకులను మెప్పించాడు. ఇప్పుడు హన్సికాని అంతకన్నా మరింత అందంగా చూపించాడని గోల్డెన్ బ్యూటీ స్టిల్స్ చూస్తేనే తెలుస్తోంది.