Begin typing your search above and press return to search.
50 క్లబ్ లో హన్సిక.. ఇంట్లో పెళ్లి బాజా..!
By: Tupaki Desk | 26 March 2021 1:40 PM IST‘దేశముదురు’ సినిమాతో సినీ ప్రయాణం మొదలుపెట్టి.. ఎన్నో చిత్రాల ద్వారా ప్రేక్షకులను అలరించింది హన్సిక. ఆ తర్వాత కోలీవుడ్ లో అడుగు పెట్టిన ఈ బ్యూటీని.. తమిళ ప్రేక్షకుల్లో గుండెల్లో పెట్టుకున్నారు. దీంతో.. ఇప్పటికీ ఈ అమ్మడికి అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి.
చూస్తుండగానే.. హన్సిక 50 చిత్రాల క్లబ్ లో చేరిపోయింది. తన అప్ కమింగ్ మూవీ ‘మహా’తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోబోతోంది. కోలీవుడ్ యాక్టర్ శ్రీకాంత్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో.. స్టార్ హీరో శింబు అతిథి పాత్రలో కనిపించనున్నారు. జమీల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
కాగా.. కొన్ని రోజులుగా పెళ్లి సంబరాల్లో మునిగితేలుతోంది హన్సిక. తన సోదరుడు ప్రశాంత్ మోత్వానీ-టీవీ నటి ముస్కాన్ నాన్సీ మార్చి 22న ఒక్కటయ్యారు. జైపూర్ లో జరిగిన ఈ వివాహ వేడుకలో హన్సిక ఫుల్లుగా ఎంజాయ్ చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అవి వైరల్ అయ్యాయి.