Begin typing your search above and press return to search.

ట్రోలర్లపై కత్తులు నూరుతున్న హన్సిక

By:  Tupaki Desk   |   31 Jan 2019 3:49 PM IST
ట్రోలర్లపై కత్తులు నూరుతున్న హన్సిక
X
హీరోయిన్ హన్సిక మోత్వాని పర్సనల్ ఫోటోలు లీక్ అయిన వ్యవహారం ఈమధ్య సోషల్ మీడియాలో సంచనలం సృష్టించింది. బికినీ ఫోటోలతో పాటుగా ప్రైవేటుగా తీసుకున్న హాటు సెల్ఫీలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో హన్సిక తన ఫోన్.. ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయ్యాయని తెలిపింది. అయినా ట్రోలర్లు మాత్రం హన్సికపై గట్టిగా విమర్శలు చేయడం మొదలుపెట్టారు.

ట్విట్టర్ ఖ్యాతా హ్యాక్ అయితే అందులోంచి ట్వీట్ ఎలా చేయగలిగావు అని కొందరు అంటే.. కెరీర్ చివరిదశకు చేరడంతో పబ్లిసిటీ కోసమే ఇలా ఫోటోల లీక్ డ్రామా ఆడుతోందని కొందరు విమర్శించారు. రీసెంట్ గా ఈ విమర్శలపై.. ట్రోలింగ్ పై హన్సిక స్పందించింది. లీక్ అయిన ఫోటోల గురించి తనేమీ బాధపడడం లేదని ఎందుకంటే వాటిలో కొన్ని ఫోటోలు నాలుగేళ్ల క్రితం తీసినవని.. మరి కొన్ని ఫోటోలను ఎవరో తెలివిగా మార్ఫింగ్ చేశారని చెప్పింది.

కానీ ఇలా ఒకరి ఫోటోలను మార్ఫింగ్ చేయడం మాత్రం దారుణం అని చెప్పింది. పబ్లిసిటీ కోసం ఇలా చేయాల్సిన అవసరం తనకు లేదని.. మొదటినుంచి తను లో-ప్రొఫైల్ మెయింటైన్ చేసేదానినని క్లారిటీ ఇచ్చింది. నెగెటివ్ మైండ్ సెట్ ఉండేవాళ్ళు మాత్రం అలా అలోచిస్తారంటూ ఇంతకంటే ఈ విషయం గురించి మాట్లాడనని డిస్కషన్ క్లోజ్ చేసింది.