Begin typing your search above and press return to search.

హన్సిక బర్త్‌ డే స్పెషల్‌.. 105 మినిట్స్ స్పెషల్‌

By:  Tupaki Desk   |   9 Aug 2022 1:28 PM GMT
హన్సిక బర్త్‌ డే స్పెషల్‌.. 105 మినిట్స్ స్పెషల్‌
X
హన్సిక ప్రధాన పాత్ర లో రుధ్రాన్ష్ సెల్యూలాయిడ్ పతాకం పై ఒకే పాత్రతో సింగిల్ షాట్ ఫార్మేట్ లో నిర్మించిన చిత్రం "105 మినిట్స్" బొమ్మక్ శివ నిర్మాణం లో దర్శకుడు రాజు దుస్సా తెరకెక్కించిన చిత్రం 150 మినిట్స్. ప్రయోగాత్మకంగా రూపొందిస్తున్న ఈ చిత్రం మేకింగ్ పరంగా ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేయబోతోంది అంటూ యూనిట్‌ సభ్యులు బలంగా చెబుతున్నారు.

నేడు హీరోయిన్ హన్సిక పుట్టిన రోజు సందర్భంగా సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ డిజైన్ కొత్తగా ఉండి ఆకట్టుకుంటోంది. మరి కొద్ది రోజుల్లో చిత్ర టీజర్ ను విడుదల చేయబోతున్నాం అంటూ యూనిట్‌ సభ్యులు పేర్కొన్నారు. పోస్ట్‌ విడుదల సందర్బంగా చిత్ర యూనిట్‌ సభ్యులు సినిమా విశేషాలను వెళ్లడించారు.

ఈ సందర్భంగా దర్శకుడు రాజు దుస్సా మాట్లాడుతూ... మా హీరోయిన్ హన్సిక గారికి టీమ్ అందరి తరుపున పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నాం.

ఆమె బర్త్ డే సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశాం. ఈ పోస్టర్ కు మంచి స్పందన వస్తోంది. త్వరలో టీజర్, ట్రైలర్ రిలీజ్ కార్యక్రమాలు ఉంటాయి.

వైవిధ్యభరితమైన కథా కథనాలతో "105 మినిట్స్" చిత్రాన్ని రూపొందిస్తున్నాం. మేకింగ్ పరంగా సింగిల్ షాట్ ప్రయోగం చేశాం. సినిమాను చిత్రీకరించిన తీరు మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది.

ఒకే పాత్రతో సాగే ఈ సినిమాలో హన్సిక నటన మెస్మరైజ్ చేస్తుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. త్వరలో "105 మినిట్స్" సినిమా ను విడుదలకు సిద్ధం చేస్తున్నాం. అన్నారు.