Begin typing your search above and press return to search.

హన్సిక ఇంట్లో సంబరాలు చూశారా??

By:  Tupaki Desk   |   9 Aug 2017 10:19 PM IST
హన్సిక ఇంట్లో సంబరాలు చూశారా??
X
చేతిలో సినిమాలు లేనప్పుడు హీరోయిన్లు ఏం చేస్తారు? అయితే స్నేహితులతో కలసి వెకేషన్లకు వెళ్ళడం లేదంటే ఇక్కడే ఏ పార్టీలో పడితే ఆ పార్టీలో కనిపించడం. ప్రస్తుతం చూస్తుంటే హన్సిక పరిస్థితి ఇదే తరహాలో కనిపిస్తోంది. అమ్మడు ఇప్పుడు ఫుల్లు ఖాళీగా ఉంది. ఈ మధ్యనే తెలుగులో గౌతమ్ నంద సినిమా విడుదలైనప్పుడు కూడా అమ్మడు ఖాళీగానే ఉంది. కాని తన స్నేహితులతో కలసి ఈస్ర్టన్ యురోపియన్ టూర్ వెళ్ళింది. ఇప్పుడు తిరిగొచ్చింది.

ఇక 1991 ఆగస్టు 9న పుట్టిన హన్సిక ఈరోజు తన 26వ పుట్టినరోజు చేసుకుంటోంది. ఈ సందర్భంగా ఆమె స్నేహితులు గత రాత్రి ఆమెను సర్పరైజ్ చేశారట. ముంబయ్ లోని హన్సిక ఇంటిని చెప్పాపెట్టకుండా వారు డెకరేట్ చేసేసి.. నైట్ ఈమెను ఒక పార్టీకి తీసుకెళ్లి.. అక్కడి నుండి తిరిగొచ్చేసరికి అదిగో ఆ ఫోటోల్లో చూస్తున్నారుగా.. ఆ రేంజులో సెలబ్రేట్ చేశారట. దానితో హన్సిక కూడా ఉబ్బితబ్బిబ్బైపోయింది. ఆ ఫోటోలన్నీ తనే తన మీడియా మిత్రులకు షేర్ చేసింది. హన్సికతో పాటు ఆమె మమ్మీ కూడా పార్టీని బాగా ఎంజాయ్ చేసిందట.

సినిమాల విషయానికొస్తే.. మాజీ హీరోయిన్ ఖుష్బూ అండ్ ఆమె భర్త సుందర్ తో ఉన్న సాన్నిహిత్యం కారణంగా ''సంఘమిత్ర'' సినిమాలో ఈమెనే మెయిన్ హీరోయిన్ గా తీసుకుంటున్నారని మొన్నటివరకు ప్రచారం జరిగింది కాని.. అందులో నిజంలేదని స్వయంగా ఆ సినిమా నిర్మాణ సంస్థ ప్రకటించింది. శృతి హాసన్ హ్యాండ్ ఇచ్చిన తరువాత ఆ రోల్ కోసం ఎవ్వరూ సెట్టవ్వట్లేదు. హన్సికను తీసుకోవట్లేదు. ప్చ్!!