Begin typing your search above and press return to search.
పెళ్లి అన్నది.. హంగామా హన్సికది
By: Tupaki Desk | 27 Nov 2017 10:15 AM ISTబన్నీ మూవీ దేశముదురుతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన హన్సిక.. ఆ తర్వాతెక్కడా గ్యాప్ తీసుకోవాల్సిన అవసరం రాలేదు. టాలీవుడ్ లో తన ట్యాలెంట్ కు తగ్గ అవకాశాలు దక్కించుకోవడంలో ఫెయిల్ అయినా.. తమిళ్ లో మాత్రం టాప్ హీరోయిన్ రేంజ్ కు చేరుకుంది హన్సిక మొత్వానీ.
ఈమెకు ప్రశాంత్ అనే ఓ సోదరుడు ఉన్నాడు. తాజాగా ఇతడి పెళ్లి వేడుకలు ఘనంగా జరిగాయి. జన్మతహా సింధీ హన్సిక కుటుంబం సింధీలు. ముంబైలో నివాసం ఉంటున్న వీరి ఇంట్లో పెళ్లి బాజాల సందడి అంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. ఇందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా నెట్ లో దర్శనం ఇచ్చాయి. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ.. యస్ అని చెప్పింది హన్సిక. సింధీ సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ పెళ్లిలో హంగామా అంతా హన్సికదే అని చెప్పాల్సిన పని లేదు. అన్న పెళ్లిలో హన్సిక చేసిన హడావిడి అంతా కాదు.
మెహందీ సమయంలోను.. పెళ్లి వేడుకల్లోనూ హన్సిక చేసిన డ్యాన్సులకు సంబంధించిన క్లిప్పింగ్స్ నెట్ లో దర్శనం ఇచ్చాయి. అన్న పెళ్లిలో ఆ మాత్రం హంగామా చేయకపోతే ఎలా అనే రేంజ్ లో హన్సిక డ్యాన్సులు ఇరగదీసేసింది. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రభుదేవా ప్రధాన పాత్రలో నటిస్తున్న గులేబకావళి అనే చిత్రంలో యాక్ట్ చేస్తోంది హన్సిక మొత్వాని.