Begin typing your search above and press return to search.

హమ్మయ్య.. హన్సిక ఆ పాట పూర్తి చేసింది

By:  Tupaki Desk   |   24 Jun 2015 11:30 AM IST
హమ్మయ్య.. హన్సిక ఆ పాట పూర్తి చేసింది
X
హన్సిక ప్రేమ వ్యవహారం సంగతేంటో కానీ.. ఆ దెబ్బకు ఆ నిర్మాత మాత్రం దారుణంగా దెబ్బతిన్నాడు. నయనతార లాంటి ప్రొఫెషనల్‌ నటి అయితే ఇబ్బంది లేదు. శింబుతో బ్రేకప్‌ అయినా.. గతం గురించి పట్టించుకోకుండా ఎంచక్కా మళ్లీ అతడితో రొమాన్స్‌ చేసింది. కానీ హన్సిక అలా కాదు. శింబు చేసిన పనికి బాగా హర్టయి.. అతడి జోలికే వెళ్లడానికి ఇష్టపడలేదు. దీంతో రెండున్నరేళ్ల కిందట మొదలైన 'వాలు' సినిమా ఇప్పటికీ విడుదల కాని పరిస్థితి. ఈ సినిమా షూటింగ్‌లోనే హన్సిక, శింబు ప్రేమలో పడ్డారు. పెళ్లికి కూడా రెడీ అయ్యారు. ఐతే సినిమా పూర్తి కాక మునుపే బ్రేకప్‌ అయిపోయింది.

ఒక్క పాట, కొన్ని సన్నివేశాలు మాత్రమే మిగిలుండగా.. శింబు, హన్సికలకు చెడింది. దీంతో షూటింగ్‌ చివరి దశలో ఆగిపోయింది. మళ్లీ ఇద్దరినీ ఒక చోటికి చేర్చి షూటింగ్‌ పూర్తి చేయడానికి నిర్మాత పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. మధ్యలో ఆర్థిక ఇబ్బందులు కూడా తోడయ్యాయి. దీంతో 'వాలు' ఎప్పటికీ రిలీజ్‌ కాదేమో అన్న సందేహాలు నెలకొన్నాయి. ఐతే ఈ మధ్యే హన్సికను ఒప్పించి.. శింబుతో కలిసి ఆమె ఆడి పాడేలా చేశారు. మిగిలిన సన్నివేశాలు కూడా పూర్తి చేసి.. సినిమాను విడుదలకు సిద్ధం చేశారు. జులై 17న 'వాలు' విడుదల విడుదల కాబోతోందని ప్రకటించారు కూడా. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత విడుదలవుతున్న శింబు సినిమా ఇది. ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి మరి.