Begin typing your search above and press return to search.

'మహా' టీజర్: సస్పెన్స్ అండ్ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ గా హన్సిక 50వ సినిమా..!

By:  Tupaki Desk   |   3 July 2021 8:39 AM GMT
మహా టీజర్: సస్పెన్స్ అండ్ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ గా హన్సిక 50వ సినిమా..!
X
'దేశముదురు' సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన హన్సిక మోత్వానీ.. తెలుగు తమిళ హిందీ భాషల ప్రేక్షకులను అలరించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే హన్సిక కెరీర్ లో 50వ సినిమాగా రూపొందుతున్న ''మహా'' చాలా కాలంగా నిర్మాణ దశలోనే ఉంది. ఫస్ట్ లుక్ తోనే సంచలనం రేపిన ఈ చిత్రం.. వివిధ కారణాలతో ఆలస్యం అవుతూ వస్తోంది. ఆపిల్ బ్యూటీ మాజీ బాయ్ ఫ్రెండ్ శింబు కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తుండంతో అందరిలో ఈ సినిమాపై ఆసక్తి కలిగింది. ఎట్టకేలకు ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతోందని తెలుస్తోంది. తాజాగా 'మహా' టీజర్ ను కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ విడుదల చేశారు.

'మహా' టీజర్ చూస్తుంటే ఇదొక సస్పెన్స్ అండ్ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. చిన్న పిల్లలను చంపే ఓ సీరియల్ కిల్లర్ చుట్టూ ఈ కథ తిరుగుతున్నట్లు టీజర్ లో చూపించారు. ఈ క్రమంలో హన్సిక తో క్లోజ్ గా ఉంటే ఓ పాపని కిల్లర్ హత్య చేసినట్లు అనిపిస్తుంది. ఈ సంఘటనతో హన్సిక జీవితం ఎలా మారిపోయిందనేది సినిమా యొక్క ప్రధానాంశంగా తెలుస్తోంది. ఇందులో కిల్లర్ కోసం వేట సాగించే పోలీస్ ఆఫీసర్ పాత్రలో 'రోజాపూలు' శ్రీకాంత్ నటించారు.

అలానే మాజీ ప్రియుడు శింబుతో హన్సిక మరోసారి రొమాన్స్ చేసినట్లు తెలుస్తోంది. శింబూకి ఇందులో హన్సిక తో రొమాంటిక్ సీన్స్ తో పాటుగా కొన్ని యాక్షన్ సన్నివేశాలు కూడా ఉన్నట్లు కనిపిస్తోంది. మొత్తం మీద థ్రిల్లింగ్ గా ఎన్నో మలుపులతో కూడుకుని ఉన్న ఈ టీజర్ ఆసక్తికరంగా ఉంది. ఈ చిత్రంలో సనమ్ శెట్టి - తంబి రామయ్య - కరుణాకరన్ ఇతర పాత్రలు పోషించారు. జిబ్రాన్ సంగీతం సమకూర్చగా.. లక్ష్మణ్ సినిమాటోగ్రఫీ అందించారు. యు.ఆర్ జమీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మాలిక్ స్ట్రీమ్స్ కార్పొరేషన్ మరియు ఎట్సెటెరా ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. త్వరలోనే 'మహా' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.