Begin typing your search above and press return to search.

సింగిల్ షాట్ లో హన్సిక 105 మినిట్స్..!

By:  Tupaki Desk   |   2 April 2022 3:03 PM IST
సింగిల్ షాట్ లో హన్సిక 105 మినిట్స్..!
X
'దేశముదురు' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన హన్సిక మోత్వాని.. తెలుగుతో పాటుగా తమిళ హిందీ చిత్రాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఆపిల్ బ్యూటీ "105 మినిట్స్" అనే ప్రయోగాత్మక సినిమాతో తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించడానికి రెడీ అయింది.

హన్సిక ప్రధాన పాత్రలో రాజు దుస్సా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా '105 మినిట్స్'. రుధ్రాన్ష్ సెల్యూలాయిడ్ పతాకంపై బొమ్మక్ శివ ఈ చిత్రాన్ని నిర్మించారు. దీనికి సామ్ సి.యస్ సంగీతం సమకూర్చారు. దుర్గా కిషోర్ సినిమాటోగ్రఫీ అందించగా.. బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు.

ఇండియన్ స్క్రీన్ పై మొట్ట మొదటిసారిగా సింగిల్ షాట్ - సింగిల్ క్యారెక్టర్ తో ఉత్కంఠ భరితంగా సాగే కథ కథనాలతో రూపొందిన సినిమా "105 మినిట్స్". టైటిల్‌‌‌‌‌‌‌‌ కి తగ్గట్టే సినిమా నిడివి 105 నిముషాలు ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ - గ్లిమ్స్ కు మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ మూవీ విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ సందర్భంగా సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన హన్సిక మోత్వాని మాట్లాడుతూ.. ''సింగిల్ షాట్ - సింగిల్ క్యారెక్టర్ తో ఎంతో వైవిధ్యంగా నిర్మించిన ఈ చిత్రం నా కెరీర్ లో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. విజువల్స్ చూసాక షూటింగ్ లో పడ్డ కష్టం అంతా మర్చిపోయాను. విజువల్స్ అంత అద్భుతంగా వచ్చాయి'' అని సంతోషం వ్యక్తం చేశారు.

నిర్మాత బొమ్మక్ శివ మాట్లాడుతూ.. సినిమా అనుకున్నది అనుకున్నట్టు చాలా బాగా వచ్చింది.బీమా డైరెక్టర్ ఏదైతే అనుకున్నాడో అది చాలా అద్భుతంగా తీసాడు. నిజంగా ఇలాంటి ప్రయోగాత్మక చిత్రాన్ని నిర్మించడం నాకు చాలా గర్వంగా ఉంది. త్వరలోనే ట్రైలర్ తో మీ ముందుకు వస్తాం అని అన్నారు.

దర్శకుడు రాజు దుస్సా మాట్లాడుతూ.. 'హీరోయిన్ హన్సిక నటనకు తోడుగా మా డిఒపి కిషోర్ కెమేరా వర్క్ - మ్యూజిక్ డైరెక్టర్ శ్యామ్ బ్యాక్ ల్ గ్రౌండ్ స్కోర్ & సౌండ్స్ ఎఫెక్ట్స్ నిజంగా ప్రాణం పోసాయి. ప్రొడక్షన్స్ డిజైనర్ బ్రహ్మ గారి వర్క్ కూడా చాలా అద్భుతంగా ఉంది. మా నిర్మాత ఎక్కడా రాజీ పడకుండా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నారు. సినిమాని త్వరలోనే మీ ముందుకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి'' అని చెప్పారు.

మ్యూజిక్ డైరెక్టర్ సామ్ సీఎస్ మాట్లాడుతూ.. 'ఇలాంటి ప్రయోగం చేయడం నిజంగా దర్శకుడికి, నిర్మాతకి చాలా పెద్ద సాహసం అనే చెప్పాలి. ఈ ప్రయోగాత్మక చిత్రానికి సంగీతం అందించడం చాలా సంతోషంగా ఉంది' అని తెలిపారు.

సినిమాటోగ్రాఫర్ దుర్గా కిషోర్ మాట్లాడుతూ.. సినిమా అనుకున్నది అనుకున్నట్టు చాలా బాగా వచ్చింది. సింగిల్ షాట్.. సింగిల్ క్యారెక్టర్.. ఇది నా కెరీర్ లో ది బెస్ట్ మూవీగా ఉండిపోతుంది అని చెప్పుకొచ్చారు.

"105 మినిట్స్'' లాంటి ఒక ప్రయోగాత్మకమైన సినిమాకి పని చేయడం చాలా సంతోషంగా వుందని యూనిట్ సభ్యులు తెలిపారు. హాలీవుడ్ సినిమాల తరహాలో సింగిల్ క్యారక్టర్ - సింగిల్ షాట్ లో చేసిన ఈ ప్రయోగం ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.